8వ రోజుకు రిలే దీక్ష | - | Sakshi
Sakshi News home page

8వ రోజుకు రిలే దీక్ష

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

ఆదిలాబాద్‌టౌన్‌: సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం నాటికి 8వ రో జుకు చేరాయి. ఇందులో భాగంగా దీక్షలో కూ ర్చున్న వారు చెవులో పూలు.. కళ్లకు నల్లగుడ్డలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్‌ ఇజ్జగిరి నారాయణ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సీసీఐని పునఃప్రారంభిస్తామని బీజేపీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. దీక్షలో ఆదిలాబాద్‌రూరల్‌ మండలం తంతోలి గ్రామానికి చెందిన యువకులు కూర్చున్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌.విలాస్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ధరేంద్ర తదితరులు మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement