కై లాస్‌నగర్: ఉత్తరాఖండ్‌లోని హల్దావనిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జు న ఖర్గే ప్రసంగించిన వేదికను బీజేపీ, ఆర్‌ఎస్ ఎస్ నాయకులు శుద్ధిచేయడం దేనికి సంకేతమని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ ప్రశ్నించారు. హల్దావని ఘటనను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. డీసీసీ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌చౌక్ వరకు ర్యాలీగా వచ్చిన నాయకులు అంబేడ్కర్ విగ్రహం ఎదుట బైఠాయించారు. నోటికి నల్లరిబ్బన్‌లు కట్టుకుని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చర్య రాజ్యాంగ స్ఫూర్తి, దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. అంతరాలు పోవా లనే లక్ష్యంతో బాబాసాహెబ్ అంబేడ్కర్ రా జ్యాంగాన్ని రచించి అందరికీ సమాన హక్కులను కల్పించారన్నారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్ నా యకులు అంటరానితనాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు. సభ వేదికలపై దళితులు మాట్లాడితే వాటిని శుద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చేసిన ఈ చర్యలను పార్టీ పరంగా ఖండిస్తున్నామన్నారు. ఇందులో మున్సిప ల్, మార్కె ట్, గ్రంథాలయ చైర్మన్లు అనూష, శ్రీకాంత్‌రెడ్డి, నర్సయ్య, పార్టీ నాయకులు సాజిద్ ఖాన్, భోజారెడ్డి, సతీష్, పరమేశ్వర్, సంజీవ్, అన్నపూర్ణ, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు.


