ఎరువు రవాణా భారం | - | Sakshi
Sakshi News home page

ఎరువు రవాణా భారం

Aug 15 2026 12:28 AM | Updated on Aug 15 2026 12:28 AM

ఈ రైతు పేరు సురేందర్‌రెడ్డి. తాంసి మండలకేంద్రం. ఈయనకు నాలుగు ఎకరాల సొంత చేను ఉండగా, మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వానకాలం సాగు మొదలు పెట్టాడు. పత్తి, సోయా వేశాడు. కౌలు రైతు పేరిట యూరియా కోసం ఈనెల 10న ఆన్‌లైన్‌ యాప్‌లో పది బ్యాగుల కోసం బుకింగ్‌ చేసుకున్నాడు. 11న తాంసి సొసైటీకి వచ్చాడు. రూ.266 చొప్పున యూరియాకు సంబంధించి పది బ్యాగులకు రూ.2,660 చెల్లించాడు. ఒక్కో బ్యాగ్‌కు రూ.19 చొప్పున మరో రూ.190 రవాణా చార్జీల కింద చెల్లించాలని సొసైటీ అధికారి చెప్పడంతో అవి ఎందుకని రైతు అడిగాడు. మార్క్‌ఫెడ్‌ నుంచి సొసైటీకి వాహనంలో వచ్చిన లోడ్‌కు సంబంధించిన రవాణా చార్జీలని అధికారి చెప్పాడు. తప్పని పరిస్థితిలో రైతు చెల్లించగా, సొసైటీ నుంచి రశీదు సైతం ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement