ఇంటర్ పరీక్షలు షురూ
పట్టణంలోని ఓ పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల సందడి
పరీక్ష నిర్వహణ తీరును పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ
కేంద్రంలోనికి వెళ్తున్న విద్యార్థులు
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజున ప్రథమ సంవత్సరం పరీక్ష నిర్వహించారు. మొత్తం 9,396 మంది విద్యార్థులకు గాను 8,839 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ వసతి జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. వసతులపై ఆరా తీసి సిబ్బందికి సూచనలు చేశారు. గదుల్లో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి రోజు పరీక్షకు 557 మంది గైర్హాజరైనట్లుగా పేర్కొన్నారు. కేంద్రాల వద్ద నిబంధనల అమలులో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అనధికార వ్యక్తులు కేంద్రం పరిసరాల్లోకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమయపాలన విషయంలో విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి వెంట ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, శిక్షణ ఐపీఎస్ రాహుల్, డీఐఈవో గణేశ్‌జాదవ్, చీఫ్ సూపరింటెండెంట్లు, విద్యా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. – ఆదిలాబాద్‌టౌన్
ఇంటర్ పరీక్షలు షురూ
ఇంటర్ పరీక్షలు షురూ


