ప్రాథమిక స్థాయిలోనే ‘ఏఐ’ బోధన | - | Sakshi
Sakshi News home page

ప్రాథమిక స్థాయిలోనే ‘ఏఐ’ బోధన

Feb 26 2026 8:25 AM | Updated on Feb 26 2026 8:25 AM

ప్రాథమిక స్థాయిలోనే ‘ఏఐ’ బోధన

ప్రాథమిక స్థాయిలోనే ‘ఏఐ’ బోధన

● కలెక్టర్‌ రాజర్షి షా ● ‘లెర్న్‌ స్మార్ట్‌ విత్‌ ఏఐ’ ప్రారంభం

ఆదిలాబాద్‌రూరల్‌: ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిస్తూ, వారి ఉజ్వ ల భవిష్యత్తుకు బాటలు వేసేలా ఏఐ ఆధారిత విద్యాబోధన దోహదపడుతుందని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ‘లెర్న్‌ స్మార్ట్‌ విత్‌ ఏఐ’ కార్యక్రమాన్ని ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఐటీడీఏ సహకారంతో ధ్యేయ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 8వ తరగతి విద్యార్థుల కోసం ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో హైబ్రిడ్‌ లెర్నింగ్‌ మోడల్‌ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలివిడతగా ఐటీడీఏ పరిధిలోని రెండు, విద్యాశాఖ పరిధిలోని ఎనిమిది పాఠశాలల్లోని 600 మంది విద్యార్థులకు ఈ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పీవో యువరాజ్‌ మర్మాట్‌ మాట్లాడుతూ విద్యార్థుల పాఠ్యాంశాలకు అనుగుణంగా ఏఐ టూల్స్‌ను బోధించనున్నట్లు పేర్కొన్నారు. ఎనిమిది నెలలపాటు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అనంతరం కార్యక్రమ పోస్టర్‌ ఆవిష్కరించి, ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇందులో డీఆర్డీవో రవీందర్‌, డీవైఎస్‌వో శ్రీనివాస్‌, ఏటీడీవో నిహారిక, సెక్టోరియల్‌ అధికారులు లక్ష్మణ్‌, అజయ్‌, దేయా సంస్థ సీఈవో ప్రణవి, ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత, తదితరులున్నారు.

ఎన్‌ ల్యాబ్‌ సందర్శన..

మావల గ్రామంలోని ఎన్‌ ల్యా బ్‌ను కలెక్టర్‌ రాజ ర్షిషా బుధవారం ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి సందర్శించారు. ఐటీ విభాగం పని తీరు, సిబ్బంది వివరాలు అడిగి తె లుసుకున్నారు. వారి వెంట సంస్థ ప్రతినిధులు ప్రణవి, అంకిత్‌, దినేష్‌, శ్రీదివ్య, తదితరులున్నారు.

బరంపూర్‌లో..

తలమడుగు: మండలంలోని బరంపూర్‌ జెడ్పీ ఉన్న త పాఠశాలలో ‘లెర్న్‌ స్మార్ట్‌ విత్‌ ఏఐ’ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం బడి తోట ను పరిశీలించారు. హెచ్‌ఎం ప్రత్యూష, ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌, తహసీ ల్దార్‌ రాజ్‌మోహన్‌, ఎంపీడీవో శంకర్‌, సర్పంచ్‌, సె క్టోరియల్‌ అధికారులు ప్రత్యూష, లక్ష్మణ్‌, అజయ్‌, బరంపూర్‌ ఆలయ కమిటీ అధ్యక్షుడు కేదారేశ్వర రె డ్డి, ఎంఈవో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement