● చివరి దశకు పత్తి కొనుగోళ్లు ● ఈసారి అధిక వర్షాల ప్రభా
సాక్షి, ఆదిలాబాద్: తెల్ల బంగారం రైతును మురిపించలేకపోయింది. జిల్లాలో పత్తి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. సాగు అంచనా ప్రకారం వచ్చిన దిగుబడిని ఇప్పటివరకు మార్కెట్‌లో విక్రయించింది కేవలం 50 నుంచి 60 శాతం మాత్రమే. మరి మిగతా పత్తి ఎటు పోయింది.. నిల్వ చేశారా అంటే.. ధర పెరుగుతుందనే ఆశతో అందులో ఐదు నుంచి 10 శాతం లోపు అలా చేసి ఉండవచ్చని అధికారులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. మరి మిగతా పత్తి ఏమైంది అంటే.. గత వాన కాలంలో కురిసిన అధిక వర్షాలతో దిగుబడిపై ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తంగా పత్తి రైతును ఈ సీజన్ ఆర్థికంగా కుదేలు పరిచినట్లుగా తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో గత వానాకాలంలో 4 లక్షల 40 వేల ఎకరా ల్లో పత్తి సాగైంది. సాధారణంగా జిల్లాలో8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడిని ఎకరానికిఅంచనా వేస్తా రు. ఈ లెక్కన 35 లక్షల నుంచి 44 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. అయితే అధిక వర్షాల ప్ర భావంతో కాయ కుళ్లిపోయి రైతుకు తీవ్ర నష్టం చే కూరింది. ఈ పరిస్థితుల్లో ఎకరానికి ఆరు క్వింటాళ్ల దిగుబడి రావచ్చని, ఆ లెక్కన 26 లక్షల వరకు వ స్తుందని మొదట్లో అంచనా వేశారు.అయితే ఆ మేర కూడాదిగుబడిమార్కెట్‌కు రాకపోవడంగమనార్హం.
పత్తి నిల్వలు
జిల్లాలో సీసీఐ 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ. 8,110 మద్దతు ధరతో రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసింది. ఈసారి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలుపరచడం, నాణ్యత విషయంలో పూర్తి ప్రమాణాలతో విక్రయాలు చేపట్టింది. రైతులు తేమ కారణంగా ఇబ్బంది పడ్డారు. పత్తిని ఆరబెట్టి విక్రయించేందుకు సరైన వసతులు లేకపోవడంతో అవస్థలకు గురయ్యారు. మరోవైపు అధిక వర్షాలు పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. శుక్రవారంతో కొనుగోళ్ల సీజన్ కూడా ముగియనుంది. సీసీఐ కేంద్రాలు మూతపడనున్నాయి. కొనుగోలు ముగిసే దశలో ఈనెల 18, 19, 20 తేదీల్లో మార్కెట్‌కు సరాసరి 16 వేల క్వింటాళ్ల వరకు పత్తి వచ్చింది. ఆ తర్వాత 2వేల క్వింటాలుకు పడిపోయింది.
సీజన్ క్లోజ్..
జిల్లాలో పత్తి కొనుగోళ్ల వివరాలు..
(క్వింటాళ్లలో)
విక్రయానికి వచ్చింది : 15.96లక్షలు
సీసీఐ కొన్నది : 15.47లక్షలు
ప్రైవేట్ కొన్నది: 48,743
● చివరి దశకు పత్తి కొనుగోళ్లు ● ఈసారి అధిక వర్షాల ప్రభా


