విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
తాంసి: పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. భీంపూ ర్ మండలం మహారాష్ట్రకు సరిహద్దున ఉన్నందున అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. భీంపూర్ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఆవరణను పరిశీలించి, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి సూచనలు చేశారు. సాయంత్రం వేళలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో వీపీవో విధానాన్ని అమలు చేయాలన్నారు. ఆయన వెంట జైనథ్ సీఐ జి.శ్రావణ్, భీంపూర్ ఎస్సై బి.విక్రమ్ సిబ్బంది ఉన్నారు.


