‘రేవంత్‌రెడ్డి పర్యటనను అడ్డుకుంటాం’
ఆదిలాబాద్‌టౌన్: సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ను అడ్డుకుంటామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జి ల్లా అధ్యక్షుడు జోగు రామన్న పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ న్‌లైన్ క్రాప్ సర్వే పేరిట భూమి ఉన్న రైతులకు రై తుబంధు ఇవ్వకుండా మోసం చేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సీఎం జిల్లా కు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఇప్పుడు కొరాటా–చనాక ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ఎన్నికల ప్ర చారంలో భాగమేనని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి రైతుల బాధలు పట్టవని, ఎన్నికలు దగ్గరపడగానే కానుకలు గుర్తుకు వస్తాయని ఆరోపించారు. నాయకులు యాసం నర్సింగరావు, గండ్రత్ రమేశ్, మెట్టు ప్రహ్లాద్, బట్టు సతీశ్, బుట్టి శివ, అడప తిరుపతి, రాఘవేంద్ర, మహేశ్, జాన్సన్ ఉన్నారు.


