ప్రకృతి సేద్యమే పరమావధిగా..
ఇచ్చోడ: మండలంలోని నవేగావ్ గ్రామానికి చెంది న రైతు రామేశ్వర్ పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చే స్తున్నాడు. రసాయనిక ఎరువుల వినియోగానికి స్వ స్తి పలికి సేంద్రియ పద్ధతిలో పసుపు, గోధుమ, కంది, శనగ పంటలు పండిస్తున్నాడు. సొంతంగా త యారు చేసుకుంటున్న ద్రవ జీవామృతం, ఘన జీ వామృతం, నిమ్మఆస్త్రం, అగ్నిఆస్త్రం, బ్రహ్మఆస్త్రం, పేడామృత ద్రావణాలను వినియోగిస్తూ సాగు చే స్తున్నాడు. సేంద్రియ విధానంలో పండించిన పంట లకు మంచి గిరాకీ ఉందని చెబుతున్నాడు. తాను పండించిన పంట ఉత్పత్తుల ద్వారా శనగ పప్పు, కంది పప్పు, గోధుమ పిండి, పసుపు స్వతహాగా త యారు చేస్తూ సామాజిక మాధ్యమాలను ప్రచారా నికి వాడుకుంటూ ఇంటి వద్దే విక్రయిస్తున్నట్లు పే ర్కొంటున్నాడు. ఎవరు ఆర్డర్ చేసిన ఇంటికే ఉత్పత్తులను పంపించడం రామేశ్వర్ ప్రత్యేకత. ఇందులో పదేళ్లుగా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.


