వ్యవసాయంపై ఆసక్తితో జాబ్ వదులుకుని..
ఉట్నూర్‌రూరల్: మండలంలోని లక్కా రం గ్రామానికి చెందిన రైతు జాడి లింగన్న–సుమలత దంపతులు సాగునే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. గతంలో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన లింగన్న వ్యవసాయంపై మక్కువతో పదేళ్ల క్రితం రైతుగా మారి సాగులో సత్తా చాటుతున్నాడు. నవోదయనగర్ సమీపంలోని తన రెండెకరా ల్లో ఆర్గానిక్ విధానంలోవంకాయ, బెండ, బీర, కాకర, సోర, కొత్తిమీర, మి ర్చి, చిక్కుడు తదితర కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాడు. మార్కెట్‌లో విక్రయించి రోజుకు సుమారు రూ.వేయి సంపాదిస్తున్నాడు. ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఆదాయం గడిస్తున్నాడు. వేసవిలో నీటి కొరతను అధిగమించేందుకు డ్రిప్ సిస్టం ద్వారా తక్కువ నీటితో సాగు విస్తీర్ణం తగ్గించకుండా శభాష్ అనిపించుకుంటున్నాడు. తనకు వ్యవసాయంపై ఇష్టం ఉండడంతో ఎంత కష్టమైనా ఉపాధిగా మలుచుకున్నట్లు చెబుతున్నాడు.


