నేరాల నియంత్రణకు నాకాబందీ
ఆదిలాబాద్‌టౌన్: నేరాల నియంత్రణకు సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో నా కాబందీ నిర్వహించినట్లు ఎస్పీ అఖిల్ మహా జన్ తెలిపారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన నాకా బందీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలా పాలు, అక్రమ రవాణాను అడ్డుకునే లక్ష్యంతో నాకాబందీ చేపట్టినట్లు తెలిపారు. 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో 28 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి జిల్లా సరిహద్దులు, మహారాష్ట్రతో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దులు, అంతర జిల్లా సరిహద్దులు, పట్టణ ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేపట్టిన ట్లు పేర్కొన్నారు. డ్రండెన్‌డ్రైవ్‌లో 37 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నంబర్ ప్లేట్లు లేని ఎనిమిది వాహనాలు, సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్‌సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


