రాజురాను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
నేరడిగొండ: మండలంలోని తన స్వగ్రామం రాజురాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ హామీ ఇచ్చారు. రాజు రాలో మంగళవారం పర్యటించారు. గడపగడపకూ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వాంకిడి నుంచి రాజురా వర కు డబుల్ రోడ్డు, గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, రింగ్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. మౌలిక వసతులు, అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి అవసరమైన స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలున్నారు.


