పశుసంతతి పెంపులో శివదత్తగిరి మహరాజ్
తాంసి: అంతరించిపోతున్న పశుసంతతి పెంచడానికి మండలంలో ని నిపాని గ్రామానికి చెందిన శివదత్తగిరి మహరాజ్ కృషి చేస్తున్నాడు. గ్రామంలో 20ఏళ్ల క్రితం శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని గ్రామస్తుల సహకా రంతో నిర్మించి అక్కడే పశువుల పెంపకం చేపట్టాడు. గ్రామస్తుల ద్వారా ఆవులను కొనుగోలు చేసి సంరక్షణ చర్యలు చేపడుతున్నాడు. ప్రస్తుతం 20కి పైగా పశువులుండగా ఆలయ ప్రాంగణంలో నిర్మించి న ప్రత్యేక షెడ్‌లో వీటికి ఆవాసం క ల్పించాడు. కాపరిని నియమించి నిత్యం వాటికి దాణా, పచ్చిగడ్డి అందిస్తున్నాడు. ప్రత్యేకంగా కొనుగోలు చేసిన సాగు భూమిలో గడ్డిని పెంచుతున్నాడు. నిత్యం ఉదయం, సాయంత్రం పశువులను చూస్తే మానసిక సంతృప్తి కలుగుతోందని శివదత్తగారి మహరాజ్ చెబుతున్నాడు. తగ్గిపోతున్న పశువుల సంతతిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా పశుపోషణ చేపట్టాలని కోరుతున్నాడు.


