ఆయన బోధనలతో ఇన్‌స్పైర్ అయ్యా..
8లోu
న్యూస్‌రీల్
● ఆ మహనీయుని ప్రేరణ.. తోడైన సంకల్పం ● ముందడుగు వేసి.. లక్ష్యాన్ని సాధించి ● గ్రూప్–1 ఆఫీసర్లుగా రాణిస్తున్న పలువురు ● నేడు యువజన దినోత్సవం
‘లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి’ అనే వివేకానందుని సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత దేశానికి అవసరమంటూ ఆయన బోధనలతో చిన్నతనం నుంచే ప్రేరణ పొందారు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో ముందుకు సాగి గ్రూప్–1 అధికారులుగా ఎంపికయ్యారు. వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేడు స్వామి వివేకానందుని జయంతి (యువజన దినోత్సవం) పురస్కరించుకుని వారిని పలకరించగా తమ విజయంలో ఆయన ప్రభావాన్ని చెప్పుకొచ్చారు. – కై లాస్‌నగర్
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026
మాది సిద్దిపేట పట్టణంలోని కలకుంటకాలనీ. నాన్న మల్లయ్య బీసీ సంక్షేమశాఖలో కుక్‌గా పనిచేసి రిటైరయ్యాడు. అమ్మ పద్మ గృహిణి. ఎంఏ. బీఎడ్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివాను. బీసీ సంక్షేమశాఖలో వార్డెన్‌గా ఆరు నెలల పాటు పనిచేశాను. సివిల్ కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికై నప్పటికీ చేరలేదు. ప్రిపేరయ్యే సమయంలో ఒంటరిగా అనిపించేది.
నిరుత్సాహానికి గురైన సమయంలో స్టడీ హాల్‌లో అతికించిన వివేకానందుడి కొటేషన్స్‌ను చదివేవాడిని. అవి నూతనోత్తేజాన్ని కలిగించేది. ప్రిపరేషన్ సీరియస్‌గా కొనసాగించేవాడిని. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది.. అలాగే నిరంతరం శ్రమించే నిన్ను చూసి ఓటమి భయపడుతుందనే వివేకానందుని బోధనలు నన్ను ఎంతగానో ఇన్‌స్పైర్ చేశాయి. గ్రూప్–1 అధికారిగా ఎదిగేందుకు తోడ్పడ్డాయి. యువత ఆయన బాటలో నడిచి సమాజానికి మేలు చేసేలా ఎదగాలి.
– ఎర్రోళ్ల అంజనేయులు , ఎంపీడీఓ, బేల
కేటీఆర్‌తో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, మాజీ మంత్రి జోగు రామన్న తదితరులు
నేరడిగొండ: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని బల్దియాల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని పా ర్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ ల క్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కో నప్ప, దుర్గంచిన్నయ్య,బాల్క సుమన్ పాల్గొన్నారు.
ఏఆర్ ద్వారా పాఠాలు వింటున్న విద్యార్థులు
ఆదివాసీల ఆత్మబంధువు
మార్లవాయిలో హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
ఆయన బోధనలతో ఇన్‌స్పైర్ అయ్యా..
ఆయన బోధనలతో ఇన్‌స్పైర్ అయ్యా..
ఆయన బోధనలతో ఇన్‌స్పైర్ అయ్యా..
ఆయన బోధనలతో ఇన్‌స్పైర్ అయ్యా..
ఆయన బోధనలతో ఇన్‌స్పైర్ అయ్యా..


