జనసంద్రమైన ‘దీక్ష భూమి’
నార్నూర్: మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామంలో జాతీయ బంజారా దీక్ష భూమి ఆదివారం భక్త జనసంద్రమైంది. వివిధ రాష్ట్రాల నుంచి బంజా రాలు భారీగా తరలివచ్చారు. దీక్ష గురువు సద్గురు శ్రీ ప్రేమ్‌సింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో గురుకృపా (గురుమిలన్) దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజ చేసి భోగ్ బండారో నిర్వహించారు. ఆధ్యాత్మిక భావనతోనే సమాజం జాగృతం అవుతుందన్నారు. లంబాడా మహిళలు సంప్రదాయ నృత్యాలు, పాటలతో హోరెత్తించారు. ఎంపీ నగేశ్ దీక్ష భూమిని సందర్శించి ప్రేమ్ సింగ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీక్ష భూమి అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి కమిటీకి పూర్తి సహకారం అందిస్తానన్నారు. కాగా దీక్ష భూమి వద్ద మూడు రోజుల పాటు జాతర కొనసాగుతుంది.
జనసంద్రమైన ‘దీక్ష భూమి’


