అ‘పూర్వ’ం.. ఆత్మీయం
ఆదిలాబాద్‌టౌన్: వారంతా బాల్యమిత్రులు.. పదో తరగతి పూర్తయ్యాక ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ చదువులమ్మ ఒ డిలో కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆ లింగనాల నడుమ నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఆదిలాబాద్‌రూరల్ మండలంలోని భీంసారి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2006 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆ త్మీయ సమ్మేళనం ఆదివారం జిల్లా కేంద్రంలోని పీ ఎస్ గార్డెన్‌లో నిర్వహించారు. 20 ఏళ్ల తర్వాత చిన్ననాటి మిత్రులంతా ఒకే వేదికపై కలవడంతో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం నాటి ఉ పాధ్యాయులు హేమ, హిమజ, సంగీత, ఉషాన్న, మూర్తి, లచ్చరెడ్డి, శైలందర్‌ను శాలువాలతో సత్కరించారు. ఇందులో పూర్వ విద్యార్థులు దేవన్న, సంతోష్, ప్రమోద్, శివకుమార్, దశరథ్, స్వాతి, అరుణ, స్వప్న, మమత, తదితరులు పాల్గొన్నారు.


