ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పా యల్ శంకర్ అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో పీఆర్టీయూ టీఎస్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్లను ఆదివారం ఆవిష్కరించా రు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము కృష్ణకుమార్, నరసింహాస్వామి, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
ఆదిలాబాద్‌రూరల్: క్రీడలు మానసికోల్లాసంతో పాటు దేహదారుడ్యానికి తోడ్పడుతాయని అదనపు కమాండెంట్ రాథోడ్ దేవిదాస్ అన్నా రు. బెటాలియన్ మైదానంలో ఇంటర్ కంపెనీ వార్షిక క్రీడా పోటీలను శనివారం ప్రారంభించారు. పలు కంపెనీలకు చెందిన సిబ్బంది ఉ త్సాహంగా పాల్గొని క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలతో సిబ్బందిలో ఐక్యత, స్నేహభావం పెంపొందుతుందనితెలిపారు. ఇందులో బెటా లియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు డీఎఫ్‌వో కార్యాలయం ఎదుట ధర్నా
కై లాస్‌నగర్: సాత్నాల మండలంలోని దుబ్బ గూడ కొలాం ఆదివాసీల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ డీఎఫ్‌వో కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు ప్రకటనలో తెలిపారు. అఖిల పక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆందోళనకు ఆయా సంఘాల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి


