జొన్న కొనుగోళ్లు ప్రారంభిస్తాం | - | Sakshi
Sakshi News home page

జొన్న కొనుగోళ్లు ప్రారంభిస్తాం

Apr 9 2025 12:14 AM | Updated on Apr 9 2025 12:14 AM

జొన్న

జొన్న కొనుగోళ్లు ప్రారంభిస్తాం

తలమడుగు: జిల్లాలో లక్ష ఎకరాల వరకు జొ న్న సాగు చేశారని, త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని కలెక్టర్‌ రాజర్షి షా తెలిపా రు. మంగళవారం మండలంలోని ఖోడద్‌ గ్రా మంలో నిర్వహించిన జొన్న పంట కోత ప్ర యోగాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలోని జెడ్పీ, ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ప్రాథమిక పాఠశాలలో అమలవుతు న్న ఏఐ బోధన తీరును తెలుసుకున్నారు. వి

ద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భో జ నం అందించాలని సూచించారు. తహసీల్దార్‌ రాజ్‌మోహన్‌, ఈపీవో వెంకటరమణ, ఎంపీడీవో చంద్రశేఖర్‌, వ్యవసాయాధికారి ప్రమోద్‌రెడ్డి, ఎంఈవో వెంకట్‌రావు పాల్గొన్నారు.

పదో తరగతి పరీక్షల

మూల్యాంకన కేంద్రం పరిశీలన

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌లో నిర్వహిస్తున్న పదోతరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని వరంగ ల్‌ ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈనెల 15 వరకు ప్రక్రియ పూ ర్తి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఇప్పటివరకు 28,726 జవాబు పత్రాల స్పాట్‌ జరిగిందని, 1,44, 207 పత్రా ల మూల్యాంకనం చేయాల్సి ఉందని తెలిపా రు. పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ వే ణుగోపాల్‌రెడ్డి, డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌ సో మయ్య, ఉపాధ్యాయ సంఘాల నేతలున్నారు.

జొన్న కొనుగోళ్లు ప్రారంభిస్తాం1
1/1

జొన్న కొనుగోళ్లు ప్రారంభిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement