● జై.. పలికారు
● లక్షణంగా సందడి
ఓడలరేవు బీచ్‌లో పతంగులను ఎగుర వేస్తున్న పర్యాటకులు
పందేలకు సై అన్నారు.. బరుల వద్ద ఎక్కడ చూసినా క్యూ కట్టారు.. ఐ.పోలవరం మండలం మురమళ్ల వద్ద కోడిపందేలు పెద్దఎత్తున జరిగాయి. రూ.కోట్లలో సాగుతున్న ఈ పందేలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు భారీగా వచ్చారు. ఆ బరి వద్ద కార్ల పార్కింగ్‌కు స్థలం సరిపోలేదు మరి. – ఐ.పోలవరం
మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భోగి మంట వేశారు. లక్షకు పైగా పిడకలతో తయారు చేసిన దండను గ్రామంలో ఊరేగించి అనంతరం ఆ దండను భోగి మంటలో వేసి సందడి చేశారు.
– మామిడికుదురు
అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరం చైన్నెలోని మేరీనా బీచ్‌ను తలపించింది. తారాడి ధర్మారావు ఆధ్వర్యంలో భోగి పండగ సందర్భంగా కై ట్ ఫెస్టివల్ నిర్వహించారు. దూరప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు వచ్చి పిల్లాపాపలతో గాలి పటాలను ఎగురవేశారు. కై ట్ ఫెస్టివల్‌కు వచ్చిన పర్యాటకులకు ఉచితంగా పతంగులను అందించారు.
– అల్లవరం
● జై.. పలికారు
● జై.. పలికారు


