పరస్పర బదిలీలకు మోక్షం
● 28 మంది టీచర్లకు స్థానచలనం ● 24న విధుల్లో చేరాలని ఆదేశం
ఆదిలాబాద్‌టౌన్: ఎట్టకేలకు ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొందరు 317 జీవో ద్వారా ఇతర జిల్లాలకు బది లీపై వెళ్లిన విషయం తెలిసిందే. అనారోగ్యం, కు టుంబానికి దూరంగా ఉంటూ కొందరు ఇతర జి ల్లాల్లో పని చేస్తున్నారు. ఇంకొందరు కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు నిత్యం రాకపోకలు సాగిస్తూ మానసికంగా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటివారికి గత డిసెంబర్‌లో పరస్పర బదిలీల కు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీంతో 28 మంది దరఖాస్తు చేసుకోగా మార్చి 28న బదిలీల ఉత్తర్వులు విడుదల చేసింది.
28 మంది బదిలీ..
పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకున్న జిల్లాలోని 28 మంది ఉపాధ్యాయులు ఈనెల 24న వారు ఎంపిక చేసుకున్న జిల్లాలో విధుల్లో చేరాల్సి ఉంది. 14 మంది ఎస్జీటీలు, తొమ్మిది మంది స్కూల్ అసిస్టెంట్లు, ఒక ఫిజికల్ డైరెక్టర్, మరో మినిస్టీరియల్ స్టాఫ్ ఉద్యోగికి స్థానచలనం జరగనుంది. ఎస్జీటీ విభాగంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఆది లాబాద్ జిల్లాకు 13 మంది రానుండగా, ఇక్కడి నుంచి అదే సంఖ్యలో ఆ జిల్లాకు వెళ్లనున్నారు. నిర్మ ల్ జిల్లాకు ఒక ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు నలుగురు, నిర్మల్ జిల్లాకు నలుగురు, మంచిర్యాల జిల్లాకు ఒకరు వెళ్లనున్నా రు. అక్కడి నుంచి తొమ్మిది మంది ఇక్కడికి రానున్నారు. మంచిర్యాల జిల్లా విద్యాధికారి కార్యాలయంలో పని చేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ ఆది లాబాద్ డీఈవో కార్యాలయానికి రానుండగా, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగి మంచిర్యాల జిల్లాకు వెళ్లనున్నారు. కాగా, ఇటీవల జరిగిన స్పౌజ్ బదిలీ ల్లో జిల్లాకు 38 మంది ఉపాధ్యాయులు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది.
కోరుకున్న జిల్లాకు వెళ్లేందుకు..
కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జి ల్లాల్లో ఉండలేక, నిత్యం జిల్లా కేంద్రం నుంచి రాకపోకలు చేస్తున్న కొందరు ఉపాధ్యాయులు కోరుకు న్న జిల్లాకు వెళ్లేందుకు రూ.10లక్షల నుంచి గరిష్టంగా రూ.20లక్షల వరకు వెచ్చించినట్లు సమాచారం. ఇందుకు పైరవీ కారులు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారిని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. పరస్పర బదిలీల్లో జిల్లాకు వచ్చేవారి సర్వీస్ జీవోగా పరిగణించబడుతుందని విద్యాశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ విషయ మై జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా, 28 మంది ఉపాధ్యాయులతో పాటు ఒక సీని యర్ అసిస్టెంట్‌కు పరస్పర బదిలీలు జరిగినట్లు వివరించారు. ఈ విద్యాసంవత్సరం చివరిరోజున దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లో విధుల్లో చేరాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు పేర్కొన్నారు.


