తొలి వేకువజామున వసంత కోకిల
స్వరాల సరాగాలు వినిపిస్తుంటే..
ముడుచుకున్న ఆలోచనలు
స్నిగ్ధమనోహరంగా
మనస్సు పొరల్లో విచ్చుకోవాలి..!
కలల వాకిళ్లపై ఆశల కల్లాపి చల్లి
ఆంతరంగిక లోగిళ్ల నిండా
వసంత వేడుకలు ఆవిష్కృతమవ్వాలి..!
ప్రతినోటా స్వచ్ఛమైన సత్యం
ఉషస్సులా ఉదయించాలి..!!
– పసుల ప్రతాప్,
ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్
సేకరణ: ఆదిలాబాద్ టౌన్


