‘ఉపాధి’లో అగ్రస్థానంలో నిలపాలి
కైలాస్‌నగర్: గ్రామాల్లో కూలీలకు వంద రో జుల పని కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉపాధిహామీ పథకం అమల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని డీఆర్డీవో రాథోడ్ రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో జిల్లాలోని తొమ్మిది మండలాలకు చెందిన ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్స్‌తో నూతన ఆర్థిక సంవత్సర ఉ పాధి పనుల కార్యాచరణపై శనివారం సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్‌కార్డు ఉండి పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపే ప్రతీ కూలీకి పని కల్పించాలన్నారు. తద్వారా గ్రామాల వారీ గా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. రానున్న రెండు నెలలు కీలకమైనందున కూలీలకు పెద్ద సంఖ్యలో పనులు కల్పించాలన్నారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశాల్లో తగు వసతులు కల్పించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి నా, అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందులో ఏడీఆర్డీవో కుటుంబరావు, ఏవీవో రాజేశ్వర్, ఏవో గంగాధర్, ఏపీడీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


