
చీమకుర్తి: సంతనూతలపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేమా యల్లయ్య చీమకుర్తి మండలంలో చేసిన సేవలు మరువలేనివని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. యల్లయ్య వర్ధంతి సందర్భంగా శుక్రవారం చీమకుర్తి తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోని వేమా యల్లయ్య మెమోరియల్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యల్లయ్య కుమారుడు, చీమకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ చీమకుర్తి మండలంలో తహసీల్దార్ కార్యాలయం, రామతీర్థంలోని పశువుల క్షేత్రం, ప్రభుత్వాస్పత్రి, ప్రభుత్వ జూనియర్ కాలేజీతో పాటు గాంధీనగర్, నెహ్రూనగర్, వీవర్స్‌కాలనీలోని పేదలకు ఇళ్ల స్థలాలు వంటి పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించిన మహనీయుడు వేమా యల్లయ్య అని కొనియాడారు. ఎమ్మెల్యేగానే కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా పనిచేసి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత యల్లయ్యకు దక్కుతుందని కొనియాడారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికలకు, స్థానిక నాయకులకు ఏర్పాటు చేసిన అల్పాహారంను బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. వైఎస్సార్ సీపీ చీమకుర్తి పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ చల్లా అంకులు, గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, డాక్టర్ బీ జవహర్, మన్నం శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నలమల మాణిక్యం, సర్పంచ్ పుల్లగూర రమణమ్మ, కౌన్సిలర్లు బీమన వెంకట్రావు, పాటిబండ్ల గంగయ్య, ఏ రామబ్రహ్మం, గంగిరెడ్డి సుందరరామిరెడ్డి, తప్పెట బాబూరావు, గోపురపు రాజ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ జ్యేష్ట శ్రీనివాసరావు, దాసరి లక్ష్మీనారాయణ, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, పాలడుగు సుబ్బారావు, బడే అయ్యపరెడ్డి, పేరం శ్రీనివాసరావు, షేక్ ఖాదర్‌బాషా, యర్రగుంట్ల వసంతరావు, పోకూరి రామకృష్ణారెడ్డి, పాటిబండ్ల రాజసులోచన, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి