breaking news
z telugu
-
ఓటీటీలో 'అభిషేక్ బచ్చన్' కొత్త సినిమా రివ్యూ
టైటిల్ : కాళిధర్ లపతానటీనటులు: అభిషేక్ బచ్చన్, దైవిక్ భగేలా, జీషన్ అయూబ్, నిమ్రత్ కౌర్ఓటీటీ: జీ5దర్శకత్వం: మధుమితఇటీవల కొన్ని సినిమాలు ఎక్కువగా నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. చిన్న చిత్రాలు అయినా కంటెంట్ బాగుంటే ఓటీటీలో అదరగొట్టేస్తున్నాయి. ఇటీవల తెలుగులో 'ఉప్పు కప్పురంబు' డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేసింది. అదే రోజు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన మూవీ 'కాళిధర్ లపతా' సైతం ఓటీటీలోనే విడుదలైంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కథ ఆధారంగా వచ్చిన చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. తమిళ చిత్రం 'కె.డి. ఎ. కరుప్పు దురై' సినిమాకు ఇది రీమేక్.కాళిధర్(అభిషేక్ బచ్చన్)ను మతిస్థిమితం లేని వ్యక్తి. ఇద్దరు తమ్ముళ్లు, ఒక సోదరితో కలిసి నివసిస్తూ ఉంటాడు. జ్ఞాపకశక్తి లోపంతో బాధపడుతున్న అతని వైద్య ఖర్ఛులు భరించలేక కుటుంబం వదిలించుకోవాలనుకుంటుంది. కంభమేళాలో వదిలించుకోవాలని తోబుట్టువులు ప్లాన్ చేస్తున్నారన్న విషయం అతనికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ. కాళిధర్ (అభిషేక్ బచ్చన్)తోనే ఈ కథ ప్రారంభమవుతుంది. తన కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్న కాళిధర్ తానే దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఓ బస్సు ఎక్కి కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.ఓ గ్రామానికి చేరుకున్న కాళిధర్ అక్కడే ఉన్న ఆలయంలో రాత్రి నిద్రపోతాడు. అక్కడే అతనికి ఎనిమిదేళ్ల బాలుడు బల్లుతో(దైవిక్ భగేలా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత అతని జీవితం మలుపు తిరుగుతుంది. వీరిద్దరు వయస్సుతో సంబంధం లేకుండా స్నేహితులుగా ఉంటారు. అయితే కాళిధర్కు మతిస్థిమితం లేదని తెలుసుకున్న బల్లు.. అతన్ని ఇబ్బంది పెడుతుంటాడు. కాళిధర్ను కేడీ అని పిలుస్తూ ఆటపట్టిస్తుంటాడు. అలా వీరిద్దరు అనాథలే కావడంతో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఈ కథ మొత్తం మధ్యప్రదేశ్‌లో గ్రామాల్లోనే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇద్దరి పరిచయం, గ్రామాల్లో తిరగడం చుట్టే ఉంటుంది. కథ నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది.ఓ సారీ కేడీ(కాళిధర్) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు బల్లు వ్యవహరించిన తీరు ఆడియన్స్‌ను ఆలోచింపజేస్తుంది. ఎనిమిదేళ్ల పిల్లాడు మాట్లాడిన తీరు ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మన కోణంలో చూస్తే వాస్తవానికి దూరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కాళిధర్, బల్లు మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య భావోద్వేగ క్షణాలతో పాటు కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కుటుంబమే వద్దనుకున్న ఓ వ్యక్తి జీవితం ఎలా మలుపు తిరిగిందనే విషయాన్ని డైరెక్టర్ ఎమోషనల్‌గా ఆడియన్స్‌కు చూపించారు. వదిలించుకోవాలని చూసిన వాళ్లు సైతం అతని కోసం గ్రామాల వెంట తిరగడం చూస్తే మానవీయ కోణంలోనూ సందేశమిచ్చారు మధుమిత. అయితే కొన్ని సీన్స్ చాలా లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలు వర్కవుట్ కాలేదు. ఓవరాల్‌గా చూస్తే ఓ ఇద్దరు అనాథల ఎమోషనల్ స్టోరీనే కాళిధర్ లపతా. స్నేహానికి వయస్సు అడ్డంకి కాదని మరో సందేశం కూడా ఇచ్చాడు.ఈ సినిమాలో మతిస్థిమితం లేని వ్యక్తిగా తనపాత్రలో అభిషేక్ బచ్చన్ అలరించాడు. అమాయకంగా కనిపిస్తూ తన పాత్రకు న్యాయం చేశాడు.ఎనిమిదేళ్ల బాలుడి పాత్రలో దైవిక్ భగేలా మెప్పించాడు. అభిషేక్ బచ్చన్‌తో పోటీపడి మరి నటించాడు. కాళిధర్ను ప్రేమించే అమ్మాయిగా.. నిమ్రత్ కౌర్ తన పాత్ర పరిధిలో అలరించింది. కాళిధర్ను కనుగొనే పాత్రలో మొహమ్మద్ జీషన్ అయూబ్ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించాడు. సాంకేతికత విషయానికొస్తేఅమిత్ ద్వివేది నేపథ్యం సంగీతం ఫర్వాలేదు. అమితోష్ నాగ్‌పాల్ స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. -
ఓటీటీలో హిట్ అయిన ఆ సినిమా.. ఇక తెలుగు ఛానెల్లో..
ఒటిటీలో హిట్ అయిన సినిమాలు మరోసారి టీవీ చానెల్లో ప్రసారం చేయడం అనేది ట్రెండ్‌కు జీ తెలుగు శ్రీకారం చుట్టింది. అదే క్రమంలో ఇప్పటికే ఓటీటీ వేదికగా మంచి పేరు తెచ్చుకున్న షాదీ ముబారక్ సినిమాని జీ తెలుగు చానెల్ తమ వీక్షకులకు అందిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి ఇంట్లో ఉండే వినోదాన్ని ఆస్వాదించాలనే ఆలోచన ప్రజల్లో కలుగుతున్న నేపధ్యంలో వారిని ఆకట్టుకోవడానికి సాగర్ ర్ కే నాయుడు నటించిన ’షాదీ ముబారక్’ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఏప్రిల్ 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు శిరీషలు నిర్మాతలు కాగా పద్మశ్రీ దర్శకత్వం వహించాడు. కధ సంక్షిప్తంగా... మాధవ్ (సాగర్ ర్ కే నాయుడు) ఆస్ట్రేలియాలో నివసిస్తాడు. అతడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి, వధువును సెలక్ట్ చేసుకునే క్రమంలో హైదరాబాద్ వస్తాడు. అక్కడే ఓ మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో వివరాలు చెప్తాడు. ఈ క్రమంలో మ్యారేజ్ బ్యూరో ఓనర్ కూతురు అయిన తుపాకుల సత్యభామ (దశ్య రఘునాథ్) పరిచయం అవుతుంది. తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో తానే బ్యూరో వ్యవహారాలు చూస్తున్న, ఆమె మాధవ్‌తో కలిసి పెళ్లి చూపులకు హాజరవుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సత్యభామ మాధవ్ ప్రేమలో పడతారు. మరి వారి ప్రేమ ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి పీటలు ఎక్కిందా? సత్యభామ మాధవ్ ఒక్కటయ్యారా లేదా అనేది షాదీ ముబారక్ కధ. -
టీవీక్షణం: ప్రతి ఇంటా... నవ్వుల పంట!
అప్పుడెప్పుడో ‘అమృతం’ అని ఓ సీరియల్ వచ్చేది. హోటల్ నడుపుకునే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ. వాళ్ల అమాయకత్వం వాళ్లకెన్ని చిక్కులు తెచ్చిపెడుతుందో చూసి జనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేవారు. ఇప్పటికీ ఏదో ఒక చానల్లో ఆ సీరియల్‌ని రిపీట్ చేస్తూనే ఉంటారు. దాన్ని సినిమాగా కూడా తీయబోతున్నారు. ఆ సీరియల్ అంతగా సక్సెస్ కావడానికి కారణం... హ్యూమర్. అందులోని ప్రతి పాత్రా కడుపుబ్బ నవ్వించేది. వారు చేసే పనులు, వారి హావభావాలు చూసి నవ్వని ప్రేక్షకుడు ఉండేవాడు కాదు. ఆ హాస్యమే ‘అమృతం’ను సూపర్ హిట్ చేసింది. ఇప్పుడు అదే కోవకి చెందిన మరో సీరియల్ వచ్చింది. దాని పేరు... ‘గంగతో రాంబాబు’. జీ తెలుగు చానెల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్లో పేరున్న నటులెవరూ లేరు. ఎటువంటి హడావుడీ ఉండదు. భారీ డైలాగులు ఉండవు. భారమైన సన్నివేశాలూ ఉండవు. ఉండేదల్లా... ఆరోగ్యకరమైన హాస్యమే. కామెడీని అద్భుతంగా పండించే వాసు ఇంటూరి దర్శకత్వంలో ఓ ఆరు పాత్రలు చేసే అల్లరి చేష్టలు, చిత్ర విచిత్ర విన్యాసాలు చూసి పడీ పడీ నవ్వుతున్నారు ప్రేక్షకులు. ఏడుపుగొట్టు సీరియళ్లతో భారమైపోయిన మనసులకు ఈ నవ్వుల నజరానా ఓ ఆటవిడుపులా పని చేస్తోంది. ఆహ్లాదాన్ని పంచుతోంది. నవ్వు ఒకప్పుడు నాలుగు విధాల గ్రేటేమో. కానీ ఒత్తిడితో మనిషి అల్లాడిపోతున్న ఈ రోజుల్లో అది నాలుగొందల విధాల గ్రేటు అయ్యింది. అందుకే ఇలాంటి సీరియల్స్ ఇంకా రావాలి. అందరి ఇంటా నవ్వుల పూలు పూయాలి! ప్రేమికుడు పోలీసయ్యాడు! హిందీ సీఐడీ సీరియల్ ఎన్నో యేళ్లుగా వస్తోంది. దాన్ని చూసినప్పుడల్లా మన భాషలో ఎందుకు రావు ఇలాంటి సీరియల్స్ అని బుల్లితెర అభిమానులు ఫీలైన సందర్భాలు లేకపోలేదు. వారి ఆశ ఇన్నాళ్లకు నెరవేరింది. తెలుగులో కూడా అలాంటి ఓ సీరియల్ మొదలైంది. అదే... సీఐడీ విశ్వనాథ్. సీరియళ్లు ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ చానెళ్లలోనే వస్తాయి. కానీ తొలిసారిగా ఓ వార్తాచానెల్ (టీవీ 5) దీనిని ప్రసారం చేస్తుండడం విశేషం! చక్రవాకం, మొగలి రేకులు వంటి సీరియల్స్ ద్వారా మంచి ప్రేమికుడిగా పరిచయమై, అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ఇంద్రనీల్... తొలిసారి ఓ పూర్తిస్థాయి యాక్షన్ రోల్ చేస్తున్నాడీ సీరియల్లో. సీఐడీ ఆఫీసర్‌గా సీరియస్ నటనను ప్రదర్శిస్తున్నాడు. క్రైమ్ ఆధారిత సీరియల్‌గా కాకుండా... మాంచి సస్పెన్స్‌తో, చక్కని కథనంతో సాగిపోతోన్న ఎపిసోడ్లు ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. అందులోనూ ఇంద్రనీల్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి... సీఐడీ విశ్వనాథ్ బ్రేకులు లేకుండా సాగి పోవడం ఖాయం! ఈసారి ‘లక్కు’తో వచ్చాడు! ఓంకార్... బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా తెలుసు. డ్యాన్స్ షోలతో హడావుడి చేసే ఈయన, ఈసారి ‘100% లక్’ (మాటీవీ) అనే షోతో వచ్చాడు. ఈ మధ్య తెలుగు చాలెళ్లలో గేమ్‌షోలు ఎక్కువయ్యాయి. లక్కు కిక్కు, నీ కొంగు బంగారం కానూ, చాంగురే బంగారు రాణి అంటూ రకరకాల షోలు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ఇదీ ఆ కోవకు చెందినదే. సెలెబ్రిటీల ఆటపాటలతో యమా సందడిగా ఉంది ప్రోగామ్. ఇక ఓంకార్ షో అంటే ఏమాత్రం రభస ఉంటుందో చెప్పక్కరేదు కదా! అయితే ప్రస్తుతానికి సక్సెస్‌ఫుల్‌గానే సాగుతోంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాం!