breaking news
Work From Office
-
అమెజాన్ కొంప ముంచుతున్న కొత్త రూల్!
ఉద్యోగుల పని విధానానికి సంబంధించి అమెజాన్ అమలుచేస్తున్న కొత్త రూల్ ఆ కంపెనీ కొంప ముంచుతోంది. 2025 జనవరి 2 నుంచి ఉద్యోగులకు ఐదు రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అమెజాన్ గత ఏడాది ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి తర్వాత కంపెనీ అనుసరిస్తున్న హైబ్రిడ్ విధానానికి ఈ కొత్త నిబంధన ముగింపు పలికింది. అయితే ఈ మార్పే ఇప్పుడు టాప్ టాలెంట్‌ను నియమించుకునే, నిలుపుకునే అమెజాన్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది.టాలెంట్ ఉన్నవారు రావడం లేదుఅమెజాన్ అంతర్గత డాక్యుమెంట్‌ను ఉటంకిస్తూ బిజినెస్ ఇన్సైడర్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఉద్యోగులు నిర్దేశిత కార్యాలయాలకు సమీపంలోకి రీలొకేట్ కావాలన్న సంస్థ "హబ్ స్ట్రాటజీ" అంశం దాని నియామక బృందాలలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం రిక్రూటర్లను "అధిక డిమాండ్ ఉన్న ప్రతిభావంతులను" తీసుకురావడాన్ని పరిమితం చేస్తుందని, ముఖ్యంగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నిపుణులను తీసుకురావడాన్ని పరిమితం చేస్తుందని చెబుతున్నారు.తక్కువ జీతమున్నా పర్లేదుగత ఏడాది రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశం తరువాత, ఈ విధానం కారణంగా అభ్యర్థులు ఆఫర్లను తిరస్కరించడం గణనీయంగా పెరిగినట్లు తాము గమనించామని కొంతమంది రిక్రూటర్లు చెప్పినట్లుగా నివేదిక పేర్కొంది. ఎక్కువ సౌలభ్యంతో ఉండటంతో చాలా మంది ప్రొఫెషనల్స్ తక్కువ వేతనానికే పోటీ సంస్థల్లో చేరడానికి ఎంచుకున్నారు. దీని వల్ల టెక్ టాలెంట్ ను కోల్పోతున్నామని ఓ రిక్రూటర్ ఆవేదన వ్యక్తం చేశారు.లాగేసుకుంటున్న పోటీ సంస్థలుఅమెజాన్ రిటర్న్ టు ఆఫీస్ ఆదేశం కేవలం రోజువారీ కార్యాలయ హాజరుకు సంబంధించినది మాత్రమే కాదని నివేదిక వెల్లడించింది. అమెజాన్ 'హబ్స్'కు మారడానికి ఇష్టపడని ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తున్నారు. ప్రమోషన్లు, పనితీరు సమీక్షలను ఈ ఆదేశానికి ముడిపడిపెట్టారు. ఈ కఠిన విధానం అమెజాన్ కు కూడా భారీ నష్టాన్ని మిగిల్చింది. గత రెండేళ్లలో ఒరాకిల్ 600 మందికి పైగా అమెజాన్ ఉద్యోగులను నియమించుకుందని బ్లూమ్‌బెర్గ్ ఇటీవల నివేదిక పేర్కొంది.అమెజాన్‌ది మాత్రం అదే మాటఅమెజాన్ ఈ వాదనలను ఖండిస్తోంది. తాము పరిశ్రమ అంతటా టాప్ టాలెంట్‌ను నియమించుకుంటూనే ఉన్నట్లు పేర్కొంది. బిజినెస్ ఇన్ సైడర్ కు ఇచ్చిన ఒక ప్రకటనలో కంపెనీ ప్రతినిధి ఈ నివేదిక ఆధారాన్ని తోసిపుచ్చారు. రిటర్న్ టు ఆఫీస్ విధానంపై కంపెనీ తన వైఖరిని సమర్థించుకుంది. "ఉద్యోగులు వ్యక్తిగతంగా సహకారంతో పనిచేసినప్పుడు ఉత్తమ ఫలితాలను వస్తాయని మేము నమ్ముతున్నాం. ఇది వాస్తవమని కూడా గమనించాం. ఎందుకంటే మేము కొంతకాలంగా ప్రతిరోజూ చాలా మందిని కార్యాలయంలో చూస్తున్నాం" అని ప్రతినిధి వివరించారు. -
టెకీలను ఆరోజు ఆఫీసులకు రప్పించాలంటున్న ఐటీ వెటరన్..
ఐటీ కంపెనీల్లో పని విధానం, వాతావరణం గురించి నిత్యం చర్చ జరుగుతూ ఉంటుంది. టెకీలకు సోమవారాల్లో ఆఫ్‌లు గానీ, వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్లు గానీ ఇవ్వకుండా ఆఫీసులకు రప్పించాలని ఓ సీనియర్ ఉన్నతోద్యోగి చేసిన సూచన తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఛీఫ్ క్వాలిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాగరాజ్ ఎం.సి.. ఐటీ ఉద్యోగులు సోమవారాల్లో తప్పనిసరిగా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని అభిప్రాయపడుతూ ప్రొఫెషనల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. పరిశ్రమలో 35 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన సోమవారాల్లో ఆఫీస్ హాజరు అన్నది ఎంత ఆవశ్యకరమో వివరించారు.సోమవారాల్లో ఆఫీస్ హాజరు ఎందుకు ముఖ్యమంటే..ఉద్యోగులు సోమవారం రోజున సెలవులు తీసుకోవడం లేదా వర్క్ ఫ్రం హోమ్ కోరడం వల్ల పని వాతావరణానికి కలిగే ఇబ్బందులను నాగరాజ్ వివరించారు. మొదటిది ఉద్యోగుల్లో ఉత్సాహం తగ్గిపోతుంది. మూడు రోజుల వీకెండ్ తర్వాత (సోమవారం తీసుకునే సెలవుతో కలుపుకొని) ఉద్యోగులు ఉత్సాహం లేకుండా వస్తారు. రెండోది ఉద్యోగులు ప్రాధాన్యతలపై దృష్టి కోల్పోతారు. సోమవారం కార్యాలయంలో ఉండటం వల్ల వారం మొత్తం పనికి దిశ చూపుతుంది. మూడోది ఉద్యోగుల మధ్య సహకారంపై ప్రభావం పడుతుంది. సోమవారం గైర్హాజరు వల్ల టీమ్ డైనమిక్స్ బలహీనమవుతుంది. కాబట్టి అన్ని కంపెనీల్లో ఉన్నతోద్యోగులు తమ సహచరులు సోమవారాల్లో తప్పనిసరిగా ఆఫీస్‌లకు వచ్చేలా ప్రోత్సహించాలని ఆయన సూచిస్తున్నారు.ఆన్లైన్ స్పందనలునాగరాజ్ ప్రతిపాదించిన సోమవారం ఆఫీస్ హాజరు సూచనపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. చాలా మంది ఈ అభిప్రాయాన్ని పాతదిగా, కఠినంగా అభివర్ణించారు. మంచి పనితీరు అంటే అవుట్‌పుట్, హాజరు కాదంటూ బదులిచ్చారు. ఏఐ, డిజిటల్ టూల్స్ వలన వర్క్ మోడల్స్ మారుతున్నాయి. సోమవారం-శుక్రవారం హాజరు మీద దృష్టి పెట్టడం మైక్రో మేనేజ్మెంట్ లా అనిపించిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.సోమవారాల్లో సెలవులు ఎందుకు పెడతారు?రెండు రోజుల వారాంతపు సెలవుల తర్వాత సోమవారం నుంచి మళ్లీ వారం ప్రారంభమవుతుంది. చాలా మంది సెలవు మూడ్‌నుంచి బయటపడి వెంటనే పనిలో నిమగ్నం కాలేరు. అందుకే సోమవారం కూడా సెలవు కావాలని కోరుకుంటారు. వీకెండ్ తర్వాత పని ప్రారంభించేటప్పుడు వచ్చే అసౌకర్య భావనలను సోమవారం బ్లూస్ అంటారు. అలసట, ఆందోళన, నిద్రలేమి, తలనొప్పులు, ఒత్తిడి వీటి లక్షణాలు. ఉద్యోగ అసంతృప్తి, పని ఒత్తిడి, వీకెండ్ అలవాట్లు వీటికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: HCLTech: మా ఐటీ ఉద్యోగులకు మాటిస్తున్నా.. -
ఉద్యోగులు ఆఫీస్‌కు రాకపోతే.. గూగుల్ కొత్త ఎత్తుగడ
ఉద్యోగులను తగ్గించుకునేందకు టెక్ దిగ్గజం గూగుల్ కొత్త ఎత్తుగడ ఎత్తుకుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానం బలోపేతం పేరుతో సాధ్యమైనంత మేర ఉద్యగులను వదిలించుకునేందుకు ప్రణాళిక వేసింది. అమెరికాలో రిమోట్ వర్క్ విషయంలో గూగుల్ కఠినమైన విధానాన్ని తీసుకుంది. ఉద్యోగులను కార్యాలయానికి తిరిగి రావాలని లేదా స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని ఎంచుకోవాలని కోరింది.కొత్త ఆదేశాల ప్రకారం.. గూగుల్‌లోని కోర్, మార్కెటింగ్, రీసెర్చ్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ (కేఅండ్ఐ), కమ్యూనికేషన్స్ సహా కీలక విభాగాల్లోని ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రధానంగా గూగుల్ కార్యాలయానికి 50 మైళ్ల లోపల నివసించే ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ఇది పనిప్రాంత అంచనాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.ఈ పరివర్తనను సులభతరం చేయడానికి, గూగుల్ కొత్త మార్గదర్శకాలను పాటించని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు స్వచ్ఛంద తొలగింపు ప్యాకేజీలను అందిస్తోంది. అయితే ఇవి తొలగింపులు కాదని గూగుల్ చెబుతున్నప్పటికీ, ఇలాంటి నిష్క్రమణ కార్యక్రమాలు చారిత్రాత్మకంగా విస్తృతమైన శ్రామిక శక్తి తగ్గింపులకు ముందు అమలవుతున్నవే.ఉద్యోగుల వ్యక్తిగత సహకారం నేరుగా ఆఫీస్‌లలో ఉండాలని భావిస్తున్న గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఐ ఫోకస్డ్ కార్యక్రమాలనూ టెక్ దిగ్గజం వేగవంతం చేసింది. కంపెనీలు తమ సొంత రిమోట్ వర్క్ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నందున, ఈ విధానం టెక్ పరిశ్రమ అంతటా ప్రకంపనలు సృష్టిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.👉ఇది చదివారా? లక్షలకొద్దీ టెకీలు.. బెంగళూరు కొత్త రికార్డ్గూగుల్ తాజా ఈ ప్రకటన కొన్ని ఆందోళనలను రేకెత్తిస్తోంది. గతంలో గూగుల్ ఇదే తరహా ఎగ్జిట్ ఆఫర్లు ఇచ్చి ఉద్యోగాల కోత విధించింది. 2023లో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది కూడా ట్రెజరీ, బిజినెస్ సర్వీసెస్ వంటి విభాగాల్లో చిన్నపాటి తొలగింపులు చేపట్టింది. ఈసారి ఎంతమందిపై ప్రభావం పడుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ.. గూగుల్ తన ఎక్కువ మంది సిబ్బందిని ఆఫీస్‌లకు తిరిగి రప్పించాలని భావిస్తోంది. ఇందుకు ఇష్టపడని వాళ్లు ఉద్యోగం వీడాల్సి ఉంటుంది. -
ఆఫీస్‌కు రాకపోతే వేరే ఉద్యోగం చూసుకోండి..
రిమోట్ వర్క్.. అదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా మంది ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఓపక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు ఉద్యోగాన్ని చూసుకుంటున్న వారికి ఈ విధానం చాలా అనువుగా ఉంటోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ రిమోట్ వర్క్ విధానం నెమ్మదిగా తొలగిపోతోంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి.సౌకర్యవంతమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడినవారు ఆఫీసులకు తిరిగివెళ్లడానికి ఇష్టపడటం లేదు. చాలా కంపెనీలు ఉద్యోగులను బలవంతంగానైనా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇలాగే ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించడం ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఎలా బెడిసికొట్టిందో.. ఉద్యోగులు ఏం చేశారో చెబుతూ ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తి రెడ్డిట్‌లో షేర్ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారంది.ఆఫీస్‌కు రాకపోతే ఏం చేస్తారు?కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసిన కంపెనీ.. ఆ సమయంలో చాలా మందిని రిమోట్ వర్క్ విధానంలోనే నియమించుకుంది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందరూ క్రమంగా ఆఫీసులకు రావాలని యాజమాన్యం ఆదేశించింది. అసలు సమస్య ఏంటంటే.. దాదాపు చాలా మంది రిమోట్ వర్క్ విధానంలోనే ఉద్యోగాల్లో చేరారు. కొంత మంది తమ ప్రాంతాలకు మకాం మార్చారు. ఇప్పుడు వీళ్లకు ఎటువంటి ఆర్థిక సహకారం అందించకుండా ఏడాదిలోగా ఆఫీసులకు వచ్చేయాలని కంపెనీ చెబుతోంది.దీంతో ఉద్యోగులు గందరగోళంలో పడిపోయారు. ఈక్రమంలో కంపెనీ వైడ్ టౌన్ హాల్ సమావేశంలో ఆఫీస్‌కు రావడానికి అయిష్టంగా ఉన్నవారికి మినహాయింపులేమైనా ఉంటాయా అని ఓ ఉద్యోగి నేరుగా సీఈవోనే అడిగేశారు. దానికి సీఈవో స్పందిస్తూ "మీరు ఇంటి నుండి పని చేయాలనుకుంటే, వేరే చోట ఉద్యోగం చూసుకోండి" అంటూ బదులిచ్చారు. దీంతో అవాక్కైన ఉద్యోగులు ఆన్లైన్ కాల్స్‌లోకి రావడం మానేశారు. చాలా మంది వెంటనే రాజీనామా చేశారు. ఎక్కువ మంది వెళ్లిపోవడంతో కంపెనీకి షాక్ తగిలింది. క్యూసీ ఉద్యోగులతోనే యాప్ డెవలప్మెంట్ చేయించాల్సి వచ్చింది. -
నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!
కరోనా తరువాత దాదాపు అన్ని కంపెనీలు.. వర్క్ ఫ్రమ్ విధానానికి మంగళం పాడాలని నిర్ణయించుకున్నాయి. దశల వారీగా ఈ విధానం తొలగించడానికి సిద్దమయ్యాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్.. టెక్నాలజీ టీమ్, నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుంచి పని చేయాలనే ఆదేశాలను జారీ చేసింది.ఎక్కువ మంది ఆఫీస్ నుంచే పనిచేయాలనే.. ఉద్దేశ్యంతో ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 10 నుంచి ఈ రూల్ అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల.. ఆదరినీ ఆఫీసుకు రప్పించాలని, ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా.. కనీసం 10 రోజులు ఆఫీస్ నుంచి, మిగిలిన రోజులు ఇంటి నుంచి పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది.ఈ విషయంపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించలేదు. అయితే సంస్థలో పనిచేస్తున్న 3.23 లక్షల కంటే ఎక్కువ మంది ఉద్యోగుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి.. ఈ తరహా హైబ్రిడ్ సిస్టం ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: తగ్గిన బెంచ్ టైమ్.. ఐటీ ఉద్యోగులకు ఊరట!ఈ కొత్త రూల్ లెవల్ 5, అంతకేనట తక్కువ స్థాయి ఉద్యోగులకు వరిస్తుందని తెలుస్తోంది. ఇందులో టీమ్ లీడర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, సిస్టమ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు ఉన్నారు. ఎవరైనా 10 రోజులు ఆఫీసుకు రానట్లయితే.. లేదా ఒకటి, రెండు రోజులు తగ్గితే.. వాటిని ఉద్యోగి సెలవుల బ్యాలెన్స్ నుంచి తీసివేసే అవకాశం ఉంది. -
వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పిన టాప్ టెక్ కంపెనీ
డెల్(Dell) టెక్నాలజీస్ హైబ్రిడ్ వర్క్ పాలసీ(వారంలో కొన్ని రోజులు ఆఫీస్ నుంచి, ఇంకొన్ని రోజులు ఇంటి నుంచి పని చేసే విధానం)కి స్వస్తి చెప్పింది. డెల్ కార్యాలయం సమీపంలో అంటే ఒక గంట ప్రయాణ సమయం పట్టే పరిధిలో ఉన్న ఉద్యోగులు మార్చి 3, 2025 నుంచి వారానికి ఐదురోజులు ఆఫీస్‌కు రావాలని స్పష్టం చేసింది. ఉత్పాదకత, సృజనాత్మకతను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డెల్ సీఈఓ మైఖేల్ డెల్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించారు.కొత్త విధానంతో డెల్ హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను ముగించింది. ఉద్యోగుల మధ్య పరస్పర చర్చల వల్ల సమర్థమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని కంపెనీ విశ్వసిస్తుంది. మైఖేల్ డెల్ తాను పంపిన ఈమెయిల్లో..‘ప్రపంచంలోని మెరుగైన అన్ని టెక్నాలజీలకు మూలం పరస్పర మానవ చర్చలే. దాంతో పనులు మరింత వేగంగా పూర్తవుతాయి’ అన్నారు. డెల్ కార్యాలయాలకు సమీపంలో గంట ప్రయాణ సమయం ఉన్న ఉద్యోగులకు కొత్త ఆదేశాలు వర్తిస్తాయి. అయితే మరింత దూరంలో నివసించే వారు రిమోట్‌గా పని చేసేందుకు సీనియర్ అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలియజేశారు.ఇదీ చదవండి: అనుకున్నదొకటి.. అయినదొకటి!ఈ ప్రకటనపై డెల్ ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది పిల్లల సంరక్షణ ఏర్పాట్లు, పార్కింగ్ కొరత వంటి లాజిస్టిక్ సవాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును అందించాయి. క్రమంగా దాన్ని తొలగించి రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఏటీ అండ్ టీ, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు కూడా ఇటీవల ఇలాంటి విధానాలను అమలు చేశాయి. -
ఉద్యోగులకు మరో షాకిచ్చిన టీసీఎస్..
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం (IT Company) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు మరో షాకిచ్చింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని (WFH) పూర్తిగా తొలగించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్న టీసీఎస్ అందులోనూ కీలక మార్పులు చేసింది.ఆఫీస్ హాజరు మినహాయింపుల కోసం అభ్యర్థనలకు సంబంధించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) విధానాన్ని టీసీఎస్ తాజాగా సవరించింది. కార్యాలయ హాజరు అవసరాలను కఠినతరం చేసింది. కంపెనీ తన భారతీయ సిబ్బందికి చేసిన ప్రకటన ప్రకారం.. ఆఫీస్ హాజరు మినహాయింపు కోసం ఉద్యోగులు ఒక త్రైమాసికంలో గరిష్టంగా ఆరు రోజులు వ్యక్తిగత అత్యవసర పరిస్థితులను కారణంగా పేర్కొనవచ్చు. ఒక వేళ ఈ మినహాయింపులను వాడుకోలేకపోయినా తరువాత త్రైమాసికానికి బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా ఉండదు.ఎంట్రీల్లోనూ పరిమితులుఇక ఒక ఎంట్రీలో గరిష్టంగా 30 మినహాయింపులను సమర్పించడానికి ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. నెట్‌వర్క్‌కు సంబంధించిన సమస్యలైతే ఒకేసారికి ఐదు ఎంట్రీలు నివేదించవచ్చు. 10 రోజులలోపు పూర్తి చేయని మినహాయింపు అభ్యర్థనలు వాటంతటవే రిజెక్ట్ అవుతాయి. ఆలస్యంగా చేసే సమర్పణలకు సంబంధించి ప్రస్తుత తేదీ నుండి మునుపటి రెండు తేదీల వరకు మాత్రమే బ్యాక్‌డేటెడ్ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. అలాగే ప్రస్తుత నెలలో డబ్ల్యూఎఫ్‌వో ఎంట్రీ కేటగిరీ లేకపోతే తదుపరి నెల 5వ తేదీ వరకు దాన్ని నివేదించవచ్చని కంపెనీ నోట్ పేర్కొంది.కార్యాలయ హాజరు ఆదేశం నుండి మినహాయింపులను అభ్యర్థించడానికి లార్జ్ స్కేల్ అప్లోడ్లు లేదా బ్యాకెండ్ ఎంట్రీలను టీసీఎస్ నిషేధించింది. ఐదు రోజుల వర్క్‌వీక్ హాజరు విధానాన్ని అవలంబించడంలో కొన్ని ఇతర భారతీయ ఐటీ సంస్థలతో పాటు టీసీఎస్ ముందంజ వేసింది. ఇతర సంస్థలు వారానికి రెండు నుండి మూడు రోజుల పాటు కార్యాలయంలో హాజరును తప్పనిసరి చేశాయి. హాజరు సమ్మతితో వేరియబుల్ పేని ముడిపెట్టాయి.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ జీతాల పెంపు.. ఎంత పెరుగుతాయంటే..ఉద్యోగులు స్థిరత్వం సాధించిన తర్వాత ఈ విధానాన్ని నిలిపివేసే అవకాశం ఉందని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కాడ్ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తర్వాత లక్కడ్ మాట్లాడుతూ ఎంట్రీ-లెవల్ ఉద్యోగులు పూర్తి వేరియబుల్ వేతనాన్ని పొందేందుకు అర్హులని, మిడ్, సీనియర్ లెవల్ సిబ్బంది వేరియబుల్ వేతనం వారి పనితీరుపై ఆధారపడి ఉంటుందని వివరించారు.40,000 మంది నియామకంటీసీఎస్ ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గినట్లు టీసీఎస్ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఫ్రెషర్లకు ఉద్యోగా అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో మిలింద్ లక్కడ్ స్పష్టం చేశారు.టీసీఎస్ సంస్థలో ఉద్యోగం పొందాలంటే.. కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదని.. అభ్యర్థులకు తగిన విద్యార్హతలు కూడా ఉండాలని లక్కడ్ వెల్లడించారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు. ఏఐ వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు. మనిషి ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే క్లయింట్లను నేరుగా సంప్రదించాల్సిన విభాగాలలో.. ఇతర అవసరమైన విభాగాల్లో మానవ వనరుల ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు.