breaking news
women raped
-
మహిళలపై నేరాలకు మరణ శిక్షే
కోల్‌కతా: మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించడానికి ఉద్దేశించిన ‘అపరాజిత’ బిల్లుకు పశి్చమ బెంగాల్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘అపరాజిత మహిళ, బాలలు(పశి్చమ బెంగాల్ చట్టాలు, సవరణ) బిల్లు–2024’ను రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి మలోయ్ ఘటక్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార, విపక్ష సభ్యులంతా బిల్లుకు అంగీకారం తెలిపారు. బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ తిరస్కరించింది.మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారి మరణానికి లేదా జీవచ్ఛవంగా మారడానికి కారణమైన దోషులకు మరణ శిక్ష లేదా పెరోల్‌కు వీల్లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా అపరాజిత బిల్లును పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలపై నేరాల కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, సత్వరమే కోర్టు నుంచి తీర్పు వచ్చేలా బిల్లులో నిబంధనలు జోడించారు. మహిళలు, చిన్నారులకు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా అత్యాచారాలు, లైంగిక నేరాలకు సంబంధించి ఇప్పుడున్న చట్టంలో కొన్ని మార్పులు చేశారు, కొత్త అంశాలు చేర్చారు.కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులకు మరణ శిక్ష విధించేలా కఠినమైన చట్టం తీసుకొస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అపరాజిత బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించడం కోసమే రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: సీఎం మమతా బెనర్జీ డిమాండ్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టని ముఖ్యమంత్రులంతా పదవులకు రాజీనామా చేయాలని పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలో అపరాజిత బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించి, బాధితులకు సత్వరమే న్యాయం చేకూర్చేలా చట్టాల్లో సవరణలు చేయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే తామే మొదట చొరవ తీసుకున్నామని తెలిపారు.అపరాజిత బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. ఇది మొత్తం దేశానికి ఒక రోల్‌మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీకి తాను రాసిన రెండు లేఖలను ఆమె సభ ముందుంచారు. మహిళలు, చిన్నారులకు భద్రత కలి్పంచేలా చట్టాలను అమలు చేయడంలో విఫలమైన పాలకులంతా పదవుల నుంచి తప్పుకోవాలని తేలి్చచెప్పారు. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్ హత్యకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని సభలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బిగ్గరగా నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్లో మహిళలపై అధికంగా నేరాలు జరుగుతున్నాయని తిప్పికొట్టారు.ఏమిటీ అపరాజిత బిల్లు?భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితతో పాటు పోక్సో చట్టానికి కూడా పశి్చమ బెంగాల్ ప్రభుత్వ అపరాజిత బిల్లు సవరణలను ప్రతిపాదించింది. ‘‘అత్యాచారం, అత్యాచారం–హత్య, సామూహిక అత్యాచారం, బాధితుల గుర్తింపు బయటపెట్టడం, యాసిడ్ దాడి వంటి నేరాలకు విధించే శిక్షలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66, 70(1), 71, 72(1), 73, 124(1), 124(2)ను సవరించాలి. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలి’’ అని పేర్కొంది.‘‘అత్యాచారం కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైన 21 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. తగిన కారణాలుంటే మరో మూడు వారాలు పొడిగించవచ్చు. దోషులకు మరణ శిక్షతో పాటు జరిమానా లేదా ఆజన్మ ఖైదు (మరణించేదాకా) విధించాలి. మహిళలపై నేరాలకు సంబంధించిన కోర్టు కార్యకలాపాలను, కేసు విచారణ వివరాలను అనుమతి లేకుండా ప్రచురిస్తే 3 నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలి. దర్యాప్తు కోసం డీఎస్పీ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. దర్యాప్తు వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కోర్టును, దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి’’ అని అపరాజిత బిల్లు ప్రతిపాదించింది. -
పని ఇప్పిస్తానని తీసుకెళ్లి ....
రాజేంద్రనగర్: మహిళపై అత్యాచారం చేసి దారుణంగా కాల్చి చంపిన నిందితుడిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... శివరాంపల్లి ఇందిరారెడ్డినగర్ ప్రాంతానికి చెందిన ఎం.పద్మమ్మ(38), తిరుపతయ్యలు దంపతులు. వీరు గత నెల 30న కూలీ పని కోసం బహదూర్‌పురా అడ్డా వద్దకు వెళ్లారు. పని దొరకకపోవడంతో సాయంత్రం ఇంటికొస్తూ దానమ్మ జోపిడీ వద్ద గల కల్లు కాంపౌండ్‌కు వెళ్లారు. ఇద్దరూ కల్లు సేవిస్తుండగా మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన ఎం.విష్ణు(28) అలియాస్ చక్రం వీరితో మాటలు కలిపాడు. గతంలో ఇడ్లీలు విక్రయించే సమయంలో పద్మమ్మ, తిరుపతయ్యలకు విష్ణుతో పరిచయం ఏర్పడింది. తనకు రాఘవేంద్ర కాలనీలోని తెలిసిన మార్వాడీ ఇళ్లల్లో పని ఉందని చెప్పి.. పద్మమ్మకు పని కల్పిస్తానని నమ్మించాడు. దీంతో పద్మమ్మ తన భర్త తిరుపతయ్యను ఇంటికి పంపి.. తాను పని చూసుకుని వస్తానని విష్ణుతో వెళ్లింది. వాళ్లిద్దరూ ఆటోలో రాఘవేంద్ర కాలనీ వద్ద దిగి అక్కడే ఉన్న మార్వాడీ ఇంట్లో పని మాట్లాడుకుని ఇంటికి బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లగానే విష్ణు.. శాస్త్రీపురంకు వెళ్లే దారిలో గుండా వెళదామని చెప్పి పద్మమ్మను తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న జీహెచ్ఎంసీ పార్కులోకి తీసుకెళ్లి పద్మమ్మపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటనతో కోపగించుకున్న పద్మమ్మ జరిగిన విషయాన్ని పోలీసులకు, భర్తకు చెబుతానని విష్ణును బెదిరిండంతో.. పక్కనే ఉన్న బండరాయితో ఆమె తలపై బాది చంపేశాడు. తర్వాత అక్కడి నుంచి ఇంటికెళ్లి బట్టలు మార్చుకుని మద్యం సేవించాడు. తిరిగి పార్కుకు చేరుకుని మరోసారి బండరాయితో మోది ఆమె మెడలోని బంగారు పుస్తె, ముక్కు పుడక, పట్టగొలుసులు, కమ్మలను తీసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పార్కులో ఉన్న చెత్తా, చెదారాలు వేసి కాల్చివేశాడు. అక్కడ నుంచి ఇంటికి తిరిగి వెళ్లాడు. స్థానికులు పార్కులో మంటలు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పద్మమ్మదిగా గుర్తించి ఆమె భర్త ఇచ్చిన సమాచారంతో విష్ణు కోసం పోలీసులు గాలించడం మొదలు పెట్టారు. సోమవారం ఉదయం వైన్స్ షాపు వద్ద కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.∙ -
చెంచు మహిళపై లైంగికదాడి
ఆత్మకూరు రూరల్: కర్నూలు జిల్లా ఆత్మకూరు రూరల్ అటవీ డివిజన్‌కు చెందిన బైలూరు చెంచు గూడెంకు చెందిన మహిళపై శుక్రవారం రాత్రి లైంగికదాడి జరిగింది. బాధితురాలు శనివారం కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్‌కు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. చెంచు మహిళ బహిర్భూమికి వెళ్లి సమయంలో సమీపంలోని కొట్టాల్చెరువు గూడెంకు చెందిన దాసరి వీరన్న అనే వ్యక్తి ఆమెపై దాడి చేసి శారీరకంగా హింసించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్ట్ చేయాలని డీఐజీ ఆత్మకూరు పోలీసులను ఆదేశించారు. అలాగే బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.