breaking news
Woman's body found
-
షికారుకు తీసుకెళ్లి ప్రియురాలి హత్య
కర్ణాటక: అనైతిక బంధాలు ఎలా విషాదాంతమవుతున్నాయో మరోసారి ఈ ఘటన చాటిచెప్పింది. జిల్లాలో జాతీయ రహదారి–948లో జవగనహళ్లి కొండ వద్ద నిర్జన ప్రాంతంలో గత నెల 22న లభించిన కాలిన స్థితిలో మహిళ మృతదేహం మిస్టరీని మళవళ్లి తాలూకా బెళకవాడి పోలీసులు ఛేదించారు. బెంగళూరులోని హారోహళ్లి కగ్గలీపురకు చెందిన నళిని (33)గా గుర్తించారు. స్థలంలో మహిళ చేతి గడియారం, ఉంగరం, హెయిర్ క్లిప్, ఇంటి తాళాలు లభించాయి. ఆమె ప్రియుడు తమిళనాడు క్రిష్ణగిరి జిల్లాకు చెందిన ఉప్పారహళ్లి రాజశేఖర్ (30) అని తేలింది. నళినికి ఇదివరకే పెళ్లయి విడిపోయింది. బెంగళూరులోని జేపీనగరలో బ్యూటీపార్లర్‌లో పనిచేసేది. నళినికి ఓ గుడి వద్ద రాజశేఖర్‌తో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. తనను పెళ్లి చేసుకోవాలని నళిని ఒత్తిడి చేయగా, నీకు ఇదివరకే పెళ్లయిందని అతడు నిరాకరించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండేది. నళిని తీరుతో కక్ష పెంచుకున్న రాజశేఖర్ మాయమాటలతో నళినిని గత నెల 22న కారులో షికారుకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి నిప్పంటించి కాల్చి వేశాడు. తర్వాత రెండు రోజులకు మళ్లీ అక్కడకు వెళ్లి కాలిన స్థితిలో శవాన్ని చూసి వెళ్లాడు. తల్లితో కలిసి నిందితుని ఆత్మహత్య పోలీసుల దర్యాప్తు తీవ్రం కావడంతో భయపడిన రాజశేఖర్ గతనెల 28న సాయంత్రం తన తల్లితో కలిసి తమిళనాడులోని ఉప్పారహళ్లి వద్ద కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అదివరకే అతన్ని విచారించగా తనకేమీ తెలియదని చెప్పాడు. తరువాత నళిని స్నేహితురాలు శ్రేయా వారి ప్రేమ గురించి పోలీసులకు వివరించింది. దీంతో మిస్టరీ వీడింది. అయితే హంతకుడు కూడా చనిపోవడంతో కేసు క్లోజ్ చేశారు. ఎస్పీ శోభారాణి, డీఎస్పీ యశ్వంత్, సీఐ శ్రీధర్, ఎస్ఐ ప్రకాష్ కేసును పర్యవేక్షించారు. -
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మొయినాబాద్ యువతి హత్య కేసు
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ యువతి హత్య కేసులో సస్పెన్స్ వీడటం లేదు. నాలుగు రోజులుగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఒక్క ఆధారం దొరకకుండా నిందితులు జాగ్రత్తపడటంతో కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు .హత్య చేసి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. చనిపోయిన యువతి ఎవరు, ఎందుకు చంపారు, అసలు చంపిదెవరు అనే విషయాలపై ఇంకా స్పష్టత రావడం లేదు. అసలేం జరిగిందంటే..మొయినాబాద్ మండలంలోని బాకారం గ్రామ శివారులో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్‌కు వెళ్ళే మార్గంలో సోమవారం పట్టపగలే యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టారు.మంటల్లో కాలిపోతున్న గుర్తు తెలియని మృతదేహాన్ని గమనించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి మృతదేహాం కాలుతూనే ఉండడంతో రైతుల సాయంతో మంటలు ఆర్పారు. అప్పటినుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో సగం కాలిపోయిన సెల్ ఫోన్ లభించగా.. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతురాలి వయసు 25 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. ఏడు బృందాలను ఏర్పాటు చేసి విచారిస్తున్నా.. వివరాలు తెలియరావడం లేదు. బాధితురాలి ఫోన్ లభించినా.. అందులో సిమ్‌కార్డు తొలగించడం, మొయినాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో కూడా మిస్సింగ్ ఫిర్యాదు అందకపోవడంతో కేసును ఛేదించడం కష్టతరంగా మారుతోంది. మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోవడంతో ఐఎంఈ నెంబర్ సిమ్ కార్డు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఆధారాలు లేకపోవడంతోనే దర్యాప్తులో ఆలస్యం అవుతుందని ఇటు పోలీసులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో ఉంచారు. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను, సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య ప్రదేశంలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు, క్లూస్ టీమ్ జల్లెడపడుతోంది. ఆ యువతి ప్యాంట్ వెనక భాగం జేబుకు ఉన్న ఓ స్టిక్కర్ లభ్యమైంది.ఒక దారిలో వచ్చి మరో దారిలో నిందితుల పోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతిని ఎక్కడో చంపి బైక్ మీద తీసుకువచ్చి ఇక్కడ కాల్చివేసినట్లుగా పోలీసులు అనుమానం చెందుతున్నారు. -
బిల్డింగ్‌పై బ్యూటీషియన్ మృతదేహం.. రూమ్మెట్ క్షణికావేశంలో..!
దేశ రాజధానిలో దారుణం జరిగింది. దక్షిణ ఢిల్లీ, మజ్ను కా తిల్లాలోని ఓ భవనంపై మహిళ మృతదేహం పడి ఉండటం స్థానికంగా కలకలం సృష్టించింది. పార్టీలో జరిగిన గొడవలో బాధిత మహిళను తన రూమ్మెంట్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. రాణి(35) గురుగ్రామ్‌లోని బ్యూటీ పార్లలో పనిచేస్తోంది. సాప్న(36) వెయిటర్ వృత్తి చేస్తోంది. వీరిరువురూ ఒకే గదిలో రెంట్‌కు ఉంటున్నారు. నిన్న జరిగిన ఓ పార్టీలో మద్యం మత్తులో ఉన్న సాప్న.. తన తండ్రిని దుర్భాషలాడింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అదే గొడవ మరుసటి రోజు ఉదయం 4గంటలకు మళ్లీ మొదలైంది. విచక్షణ కోల్పోయిన సాప్న రూమ్‌లో ఉన్న కత్తితో రాణిపై దాడి చేసింది. రాణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రాణి మృతదేహం భవనం టెర్రస్ పైన పడి ఉందని పోలీసులు తెలిపారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న సాప్నకు ఓ కుమార్తె కూడా ఉన్నట్లు వెల్లడించారు. సాప్న నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు. చదవండి:రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో..కేసుపై పోలీసుల తంట..! -
సంచిలో మహిళ మృతదేహం


