breaking news
Woman Treasure Bank
-
బెల్ట్ షాపులు బంద్ పెట్టేదెప్పుడు?
• స్త్రీనిధి బ్యాంకు సర్వసభ్య సమావేశంలో మంత్రి జూపల్లిని ప్రశ్నించిన మహిళలు • వీధికో బెల్ట్ షాపుంటే మా బతుకులెట్లా బాగుపడతారుు? సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాగానే బెల్ట్‌షాపులు బంద్ పెడ్తామన్నారు. గ్రామ్ర గామాన వీధికో షాపులెక్కన వెలిసినయ్. బెల్ట్ షాపులను సర్కారు బంద్ పెట్టకుంటే మా బతుకులెట్లా బాగుపడతాయ్ సారూ..’’ అంటూ మహిళలు మంత్రి జూపల్లి కృష్ణా రావును నిలదీశారు. మంగళవారం హైదరా బాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘స్త్రీనిధి’ బ్యాంకు రెండో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సాధికా రత కోసం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం సలహాలు, సూచనలివ్వాలని మంత్రి కోరారు. దీంతో పలువురు మహిళలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, స్త్రీనిధి బ్యాంకు అధికారుల అలసత్వాన్ని ఎత్తిచూపారు. నల్లగొండ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుమలత బెల్ట్ షాపుల అంశంపై నిలదీశారు. వడ్డీ రీరుుంబర్స్ ఏది? వడ్డీ లేని రుణాల (వీఎల్ఆర్) పథకం కింద తీసుకున్న రుణాలతో పాటు తాము చెల్లించిన వడ్డీని 11 నెలలైనా ప్రభుత్వం రీరుుంబర్స్ చేయలేదని సమావేశంలో జయశంకర్ జిల్లాకు చెందిన ఫర్హానాబేగం నిలదీశారు. ఏడాదిగా అభయహస్తం పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి చెప్పాలని వరంగల్ జిల్లా పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు ప్రకాశమ్మ పట్టుబట్టారు.జిల్లాకో కలెక్టర్‌ను నియమించినపుడు స్త్రీనిధి బ్యాంక్‌లో రెండేసి జిల్లాలకు ఒక్కో డెరైక్టర్‌ను ఏర్పాటు చేస్తామ నడం సరికాదని సూర్యాపేట జిల్లాకు చెందిన మహిళలు ఆక్షేపించారు. గ్రామ సమాఖ్యలకు ఇచ్చిన విధంగానే పట్టణ సమాఖ్యలకు కూడా వ్యాపారాలకు, పరిశ్రమల స్థాపనలకు రుణా లివ్వాలని సరూర్‌నగర్‌కు చెందిన పద్మ స్త్రీనిధి బ్యాంకు అధికారులకు సూచించారు. రుణ ప్రణాళికకు ఆమోదం... ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని పాలకమండలి చేసిన ప్రతిపాదనకు స్త్రీనిధి బ్యాంకు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొత్తం రుణ ప్రణాళికలో రూ.1,450 కోట్లు సెర్ప్ ద్వారా, రూ.15 కోట్లు మెప్మా ద్వారా పంపిణీ చేయాలని నిర్ణరుుంచారు. నికరలాభం రూ.18.54 కోట్లలో ఒకశాతం విద్యానిధికి, ఒకశాతం స్వంత భవనాల ఏర్పాటుకు వెచ్చించాలని సమావేశం నిర్ణరుుంచింది. సిబ్బందికి 30 శాతం వేతనపెంపు, సెర్ప్ నుంచి ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకోవడం, ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ వర్తింపు తదితర అంశాలను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. గ్రామాల్లో బ్యాంకుల తరపున మహిళా సమాఖ్యల సభ్యులు బిజినెస్ కరస్పెండెంట్లుగా పనిచేసే విధంగా బ్యాంక్ నియమావళిలో సవరణలు చేసేం దుకు ఆమోదం లభించింది. సమావేశంలో బ్యాంక్ పాలకమండలి అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి కమల, కోశాధికారి స్వరూప, ఎండీ జీవీఎస్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, సెర్ప్ సీఈవో నీతూకు మారి ప్రసాద్, డెరైక్టర్లు రాజేశ్వర్‌రెడ్డి, వెంగళ్ రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికే అప్పుఇచ్చే స్థారుుకి చేరాలి: జూపల్లి స్త్రీనిధి బ్యాంక్ ఆదాయం ఏటా పెరుగుతుండడం అభినందనీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బ్యాంకు మూలధనంలో ప్రభుత్వ వాటా కంటే మహిళా సమాఖ్యల వాటానే ఎక్కువగా ఉందని, అవసరమైతే ప్రభుత్వానికీ అప్పు ఇవ్వగలిగే స్థారుుకి స్త్రీనిధి బ్యాంక్ ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. మహిళలు కోరిన విధంగా రాష్ట్రంలో బెల్టు షాపుల నియంత్రణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ పెరిగిందని చెప్పారు. అభయహస్తం పింఛన్లు, వడ్డీలేని రుణాల విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త జిల్లాలకు డెరైక్టర్ల ఎన్నికలను నెలరోజుల్లో పూర్తి చేయాలని స్త్రీనిధి బ్యాంక్ అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. -
స్త్రీ నిధిపై వడ్డీంపు
- రుణాలపై 14 శాతం వడ్డీ భారం - జిల్లాలో 32 వేల మంది మహిళలు తీసుకున్న రుణం రూ.42 కోట్లు పెరవలి : మహిళలూ.. మీరు డ్వాక్రా సంఘా ల్లో సభ్యులా..! స్త్రీ నిధి బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు తీసుకున్నారా.. అరుు తే, ఇకపై ఏడాదికి 14 శాతం వడ్డీ (ప్రతి రూ.వెరుు్యపై నెలకు రూ.11.67 పైసలు) చెల్లించాల్సిందే. జూలై 1నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మహిళా సాధికారతను పెంపొందించే చర్యల్లో భాగంగా డ్వాక్రా సంఘాల్లో నిరుపేద మహిళలకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్త్రీ నిధి బ్యాంకును ఏర్పాటు చేసిన విషయం విదితమే. జిల్లాకు చెందిన మల్లవరపు జీవమణి ఆ బ్యాంకు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ బ్యాం కు ద్వారా జిల్లాకు చెందిన సుమారు 32 వేల మంది డ్వాక్రా మహిళలు రూ.42 కోట్లను వడ్డీ లేని రుణాలుగా తీసుకున్నారు. పాలకోడేరు, భీమవరం, ఆకివీడు, నరసాపురం, మొగల్తూరు, ఆచంట తదితర మం డలాలకు చెందిన నిరుపేద మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రూ.రెండేసి కోట్ల చొప్పున రుణాలు ఇవ్వగా, ఇతర మండలాల్లో రూ.50 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకూ రుణాలు అందిం చారు. ప్ర భుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల నేపథ్యంలో వారం తా వచ్చేనెల నుంచి 14 శాతం వడ్డీ భారం మోయూల్సిందే. జూలై 1నుంచి వడ్డీ కట్టాలి స్త్రీ నిధి రుణాలు తీసుకున్న లబ్ధిదారులంతా జూలై 1 నుంచి రుణం మొత్తంపై ఏడాదికి 14 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉందని ఇందిరాక్రాంతి పథం ఏపీఎం బి.రామకృష్ణ తెలిపారు. పెరవలి ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం గ్రామసమాఖ్యలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఈ రుణాలపై సున్నా శాతం వడ్డీ ఉండేదన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం వచ్చే నెల నుంచి వడ్డీ వసూలు చేయాల్సి ఉందని చెప్పారు. ఆయా సంఘాలు తీసుకున్న రుణాలపై విధిగా వడ్డీ చెల్లించాలని స్పష్టం చేశారు. సభ్యుల్ని చేర్పించండి గ్రామాల్లో పేద, నిరుపేద కుటుంబాల వారిని, వికలాంగులను గుర్తించి పొదుపు సంఘాల్లో చేర్పించాలని రామకృష్ణ సూచిం చారు. సంఘాల్లో సభ్యులు ఎక్కువగా ఉంటే కొత్త సంఘాలను ఏర్పాటు చేయాల న్నారు. ఆగస్టు 31లోపు కొత్త సంఘాల ఏర్పాటు పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం గ్రామాల్లో సర్వే నిర్వహించి అర్హులైన వారిని గుర్తించాలన్నారు. గ్రామసంఘాల పనితీరు సక్రమంగా ఉండేలా సీసీలు సంఘ సభ్యులను చైతన్యపరచాలని చెప్పారు. ప్రతి డ్వాక్రా సంఘం ప్రతినెలా సమావేశం నిర్వహించి పుస్తకాలను నిర్వహించేలా చూడాలని, సంఘ కార్యకలాపాలను ప్రతి సభ్యురాలికి తెలియజేయూలని సూచించారు. పెరవలి మండలంలో 32 గ్రామ సమాఖ్యలు ఉండేవని, డ్వాక్రా సంఘాలు పెరగడం వలన కార్యకలాపాల నిర్వహణ కష్టతరం అవుతుండటంతో ఎక్కువ సంఘాలు ఉన్న గ్రామ సమాఖ్యలను రెండుగా విభజించామని చెప్పారు. దీనివల్ల పెరవలి మండలంలో మరో 21 గ్రామ సంఘాలు కొత్తగా ఏర్పడ్డాయని వివరించారు. సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు పంపన జ్యోతి, సుందర మంగతాయారు, సీసీలు కనకదుర్గ, మహాలక్ష్మి, బాషా పాల్గొన్నారు.