బెల్ట్ షాపులు బంద్ పెట్టేదెప్పుడు? | womens asked jupally krishna rao for belt shops banned | Sakshi
Sakshi News home page

బెల్ట్ షాపులు బంద్ పెట్టేదెప్పుడు?

Nov 16 2016 2:49 AM | Updated on Sep 4 2017 8:10 PM

సమావేశంలో స్త్రీనిధి సభ్యులకు చెక్కునందిస్తున్న మంత్రి జూపల్లి

సమావేశంలో స్త్రీనిధి సభ్యులకు చెక్కునందిస్తున్న మంత్రి జూపల్లి

‘‘తెలంగాణ రాగానే బెల్ట్‌షాపులు బంద్ పెడ్తామన్నారు. గ్రామ్ర గామాన వీధికో షాపులెక్కన వెలిసినయ్.

స్త్రీనిధి బ్యాంకు సర్వసభ్య సమావేశంలో మంత్రి జూపల్లిని ప్రశ్నించిన మహిళలు
వీధికో బెల్ట్ షాపుంటే మా బతుకులెట్లా బాగుపడతారుు?

సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాగానే బెల్ట్‌షాపులు బంద్ పెడ్తామన్నారు. గ్రామ్ర గామాన వీధికో షాపులెక్కన వెలిసినయ్. బెల్ట్ షాపులను సర్కారు బంద్ పెట్టకుంటే మా బతుకులెట్లా బాగుపడతాయ్ సారూ..’’ అంటూ మహిళలు మంత్రి జూపల్లి కృష్ణా రావును నిలదీశారు. మంగళవారం హైదరా బాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘స్త్రీనిధి’ బ్యాంకు రెండో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సాధికా రత కోసం, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం సలహాలు, సూచనలివ్వాలని మంత్రి కోరారు. దీంతో పలువురు మహిళలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, స్త్రీనిధి బ్యాంకు అధికారుల అలసత్వాన్ని ఎత్తిచూపారు. నల్లగొండ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుమలత బెల్ట్ షాపుల అంశంపై నిలదీశారు.

 వడ్డీ రీరుుంబర్స్ ఏది?
వడ్డీ లేని రుణాల (వీఎల్‌ఆర్) పథకం కింద తీసుకున్న రుణాలతో పాటు తాము చెల్లించిన వడ్డీని 11 నెలలైనా ప్రభుత్వం రీరుుంబర్స్ చేయలేదని సమావేశంలో జయశంకర్ జిల్లాకు చెందిన ఫర్హానాబేగం నిలదీశారు. ఏడాదిగా అభయహస్తం పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి చెప్పాలని వరంగల్ జిల్లా పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు ప్రకాశమ్మ పట్టుబట్టారు.జిల్లాకో కలెక్టర్‌ను నియమించినపుడు స్త్రీనిధి బ్యాంక్‌లో రెండేసి జిల్లాలకు ఒక్కో డెరైక్టర్‌ను ఏర్పాటు చేస్తామ నడం సరికాదని సూర్యాపేట జిల్లాకు చెందిన మహిళలు ఆక్షేపించారు. గ్రామ సమాఖ్యలకు ఇచ్చిన విధంగానే పట్టణ సమాఖ్యలకు కూడా వ్యాపారాలకు, పరిశ్రమల స్థాపనలకు రుణా లివ్వాలని సరూర్‌నగర్‌కు చెందిన పద్మ స్త్రీనిధి బ్యాంకు అధికారులకు సూచించారు.

 రుణ ప్రణాళికకు ఆమోదం...
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని పాలకమండలి చేసిన ప్రతిపాదనకు స్త్రీనిధి బ్యాంకు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొత్తం రుణ ప్రణాళికలో రూ.1,450 కోట్లు సెర్ప్ ద్వారా, రూ.15 కోట్లు మెప్మా ద్వారా పంపిణీ చేయాలని నిర్ణరుుంచారు. నికరలాభం రూ.18.54 కోట్లలో ఒకశాతం విద్యానిధికి, ఒకశాతం స్వంత భవనాల ఏర్పాటుకు వెచ్చించాలని సమావేశం నిర్ణరుుంచింది. సిబ్బందికి 30 శాతం వేతనపెంపు, సెర్ప్ నుంచి ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకోవడం, ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ వర్తింపు తదితర అంశాలను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.

గ్రామాల్లో బ్యాంకుల తరపున మహిళా సమాఖ్యల సభ్యులు బిజినెస్ కరస్పెండెంట్లుగా పనిచేసే విధంగా బ్యాంక్ నియమావళిలో సవరణలు చేసేం దుకు ఆమోదం లభించింది. సమావేశంలో బ్యాంక్ పాలకమండలి అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి కమల, కోశాధికారి స్వరూప, ఎండీ జీవీఎస్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్, సెర్ప్ సీఈవో నీతూకు మారి ప్రసాద్, డెరైక్టర్లు రాజేశ్వర్‌రెడ్డి, వెంగళ్ రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికే అప్పుఇచ్చే స్థారుుకి చేరాలి: జూపల్లి
స్త్రీనిధి బ్యాంక్ ఆదాయం ఏటా పెరుగుతుండడం అభినందనీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బ్యాంకు మూలధనంలో ప్రభుత్వ వాటా కంటే మహిళా సమాఖ్యల వాటానే ఎక్కువగా ఉందని, అవసరమైతే ప్రభుత్వానికీ అప్పు ఇవ్వగలిగే స్థారుుకి స్త్రీనిధి బ్యాంక్ ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. మహిళలు కోరిన విధంగా రాష్ట్రంలో బెల్టు షాపుల నియంత్రణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ పెరిగిందని చెప్పారు. అభయహస్తం పింఛన్లు, వడ్డీలేని రుణాల విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త జిల్లాలకు డెరైక్టర్ల ఎన్నికలను నెలరోజుల్లో పూర్తి చేయాలని స్త్రీనిధి బ్యాంక్ అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement