breaking news
woman photo journalist
-
క్లిక్ @ కిక్
ఫొటో జర్నలిస్ట్‌గా ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలను ఒక్కసారి కవర్ చేయడమే విశేషంగా భావిస్తారు. అస్సాంకు చెందిన గీతికా తలుక్దార్ మన దేశం నుంచి వరుసగా మూడోసారి ఫిఫా వరల్డ్ కప్‌ను కవర్ చేసే అవకాశం పొందిన ఏకైక ఉమెన్ ఫోటో జర్నలిస్ట్‌గా ప్రత్యేకత సాధించారు. వరుసగా మూడుసార్లు పురుషుల ఫిఫా వరల్డ్ కప్‌కు అధికారిక గుర్తింపు పొందిన గీతిక అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగానికి సంబంధించి రిపోర్టింగ్, ఫొటోగ్రఫీలో అపారమైన అనుభవం ఉన్న మీడియా నిపుణుల ప్రత్యేక బృందంలో చేరారు.గీతికా తలుక్దార్కు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను కవర్ చేయడంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2018లో రష్యా, 2022లో ఖతార్ తర్వాత ఇది ఆమెకు వరుసగా మూడవ ఫిఫా ప్రపంచకప్ అసైన్మెంట్.అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో జన్మించారు గీతిక. తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పెరిగారు. కేంద్రీయ విశ్వవిద్యాయంలో చదువుకున్నారు.దక్షిణ కొరియాలోని ‘సియోల్ నేషనల్ యూనివర్శిటీ’లో గ్లోబల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చేశారు. దక్షిణ కొరియా క్రీడా, సాంస్కృతిక మంత్రిత్వశాఖ నుంచి స్కాలర్షిప్ అందుకున్నారు. ‘సియోల్ నేషనల్ యూనివర్శిటీ’లో చదువుకోవడం ఆమె ప్రాపంచిక దృక్పథాన్ని విశాలం చేసింది.ఈశాన్య ప్రాంత ప్రతిభ ఏ అంతర్జాతీయ వేదికపైనైనా పోటీపడగలదనే ఆమె నమ్మకాన్ని బలపరిచింది. ఆ తరువాత క్రీడా జర్నలిజం వైపు అడుగులు వేసి ఫొటోగ్రఫీని తన కెరీర్‌గా ఎంచుకున్నారు గీతిక.మానవీయ కోణంలో....ఒక ఫొటో న్యూస్ ఏజెన్సీతో గీతిక కెరీర్ మొదలైంది. ఆ తరువాత పూర్తిస్థాయిలో స్పోర్ట్స్ జర్నలిజం, స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ వైపు వచ్చారు. స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ అంటే కేవలం ప్లేయర్స్ గోల్స్ కొడుతున్నప్పుడు ఫొటోలు తీయడం మాత్రమే కాదు. ఇలా కనిపించి అలా క్షణాల్లో మాయమయ్యే ఒత్తిడి, ప్రతిచర్యలు, భావోద్వేగాలను వేగంగా బంధించడం కూడా. ఆ కళలలో ఆరితేరారు గీతిక. ఆటలను చూసే క్రమంలో అభిమానుల స్పందన, అథ్లెట్ల సంబరాలు, ఒత్తిడిలో ఉన్న జట్టు... ఇలా క్రీడలు, క్రీడా కార్యక్రమాల చుట్టు ఉన్న వాతావరణాన్ని, క్రీడలలోని మానవీయ కోణాన్ని డాక్యుమెంట్ చేస్తాయి ఆమె తీసిన ఫొటోలు. గణాంకాలు ఎప్పటికీ తెలియజేయలేని కథలను గీతిక తీసిన ఫొటోలు చెబుతాయి.అత్యంత పోటీలో... అరుదైన అవకాశంరష్యా, ఖతార్‌లలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌తోపాటు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన ఫిఫా మహిళల వరల్డ్‌కప్‌లు, టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్, ఐపీయల్ సీజన్లు, కామన్వెల్త్ గేమ్స్, ఐసీసీ టోర్నమెంట్స్ కవర్ చేశారు గీతిక. ఆమె కెరీర్లో ఫిఫా అక్రిడిటేషన్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ టోర్నమెంట్లలో ప్రవేశం పొందడం అత్యంత పోటీతో కూడుకున్నది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది జర్నలిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లు దరఖాస్తు చేసుకుంటారు.కెరీర్లో మైలురాయిఫిఫా వరల్డ్ కప్ కోసం అంతర్జాతీయ మీడియా కవరేజ్ బృందంలో మూడోసారి ఎంపిక కావడాన్ని తన కెరీర్లో ఒక మైలురాయిగా అభివర్ణిస్తూ, తనకు మద్దతు ఇచ్చిన ఫిఫా, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్యలకు గీతిక ధన్యవాదాలు తెలియజేశారు.స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ ఇప్పటికీ పురుషాధిక్యతతోనే ఉంది. నిరంతర ప్రయాణాలు, ఎక్కువ పనిగంటలు అవసరమయ్యే ప్రపంచస్థాయి టోర్నమెంట్లలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మహిళా జర్నలిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లని ప్రోత్సహించడంలో భాగంగా 2024లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, పారిస్ ఒలింపిక్స్‌ను కవర్ చేయడానికి గీతికకు నేరుగా గుర్తింపు ఇచ్చింది. భారతదేశం నుండి ఈ గుర్తింపు పొందిన తొలి, ఏకైక మహిళా ఫొటోగ్రాఫర్‌గా నిలిచారు గీతిక.ఇదొక సుదీర్ఘ ప్రయాణంఏదీ ఒక్కరోజులోగానీ, ఒక్క ప్రయత్నంలోగానీ రాలేదు. ఇదొక సుదీర్ఘమైన ప్రయాణం. నా అభిరుచి, నేను ఎంచుకున్న ప్రొఫెషన్లో పడిన కఠోరశ్రమ, అంకితభావం ప్రపంచవ్యాప్త గుర్తింపును ఇచ్చింది. అవకాశాలను అందించింది. నా ప్రయాణంలో నాకు వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన వారికి, విలువలు నేర్పిన కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.– గీతికా తలుక్దార్ -
తొలి మహిళా ఫోటో జర్నలిస్టుకు గూగుల్ నివాళి
స్పెషల్ డూడుల్స్‌తో వివిధ విశిష్ట వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తు చేసుకునే గూగుల్ తాజాగా మరో ఆసక్తికరమైన డూడుల్‌ను తయారు చేసింది. భారతదేశంలోనే తొలి మహిళా ఫోటో జర్నలిస్టు హోమాయ్ వ్యరవాల్లకు నివాళిగా డూడుల్‌ని ప్రదర్శించింది. డిసెంబర్ 9 ఆమె 104వ జయంతి సందర్భంగా గూగుల్ డూడుల్‌తో ఆమెకు ఘన నివాళులర్పించింది. ముంబై కళాకారుడు సమీర్ కులవూర్ ఈ డూడుల్ ను రూపొందించారు. గుజరాత్ నవ్సారిలో హోమాయ్ జన్మించారు. సెయింట్ జేవియర్స్ కాలేజీలో డిప్లొమా అనంతరం ఉన్నత చదువుల కోసం ముంబై వెళ్లారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ మానెక్సా పెళ్లి చేసుకున్నారు. తన భర్త నుంచే హొమాయ్ ఫోటోగ్రఫీని నేర్చుకున్నారు. 1942 లో ఆమె బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో పూర్తికాల ఉద్యోగిగా చేరారు. బ్రిటీష్ కాలం నుంచి భారత్‌కు స్వాతంత్రం వచ్చేంత వరకు తను ఫోటోగ్రాఫర్‌గా దేశానికి విశిష్ట సేవలను అందించారు. ముఖ్యంగా 1947 ఆగస్ట్ 15న తొలి పతాకావిష్కరణ సందర్భంగా మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ లాంటి జాతీయ నాయకుల ఫోటోలు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే ఇండియానుంచి లార్డ్ మౌంట్ బాటన్ నిష్క్రమణతోపాటు, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానుభావుల అంతిమ యాత్రలను హొమాయ్ కవర్ చేశారు. క్వీన్ ఎలిజెబిత్, యూఎస్ మాజీ అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్‌హోవర్ భారత్‌ను పర్యటించినప్పడు కూడా వాళ్ల ఫోటోను హొమాయే తీశారు. హొమాయ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2011లో పద్మ విభూషణ్‌తో సత్కరించింది. సబీన్ గాడిహోక్ అనే ఆమె సన్నిహితులొకరు సాహసోపేత మహిళగా ఆమెను అభివర్ణించడం విశేషం. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభంలో ఒక ఫోటో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన హోమాయ్ ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాకు పనిచేశారు. అయితే 1938లో ముంబై మహిళల క్లబ్లో మహిళల పిక్నిక్ పార్టీకోసం తీసిన ఫోటో మొదటి ఫోటో. కాగా 'బొంబాయి క్రానికల్' లో తొలి ఫోటో ప్రచురితమైంది. దీనికి ఆమె ఒక రూపాయిని పత్రిక చెల్లించింది. దాల్డా 13పేరుతో ఆమె ఫోటోలను పబ్లిష్ చేసేవారు. జనవరి 15, 2012 న 98 సంవత్సరాల వయసులో హోమాయ్ తుదిశ్వాస విడిచారు. -
మహిళా ఫొటో జర్నలిస్టులకు భద్రత కల్పించాలి: దేవులపల్లి అమర్
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహిళా ఫొటో జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు. మహిళలపై లై ంగిక దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ జగ్జ్జీవన్రామ్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ముంబైలో వార్తల సేకరణకు వెళ్లిన మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై దుండగులు లైంగికదాడికి పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దోషులకు వెంటనే శిక్ష పడే లా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత విధులు నిర్వహించే మహిళా ఫొటో జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, కార్యదర్శి కె.ఎన్.హరి ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో హెచ్‌యూజే నాయకులు సురేశ్, రవీందర్‌రెడ్డి, మహేశ్, వెంకట్రావ్, ఎం.రవికుమార్, ఆర్.ఎస్.జె. థామస్ పాల్గొన్నారు.


