మహిళా ఫొటో జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు. మహిళలపై లై ంగిక దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ జగ్జ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహిళా ఫొటో జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు. మహిళలపై లై ంగిక దాడులను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ జగ్జ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ముంబైలో వార్తల సేకరణకు వెళ్లిన మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై దుండగులు లైంగికదాడికి పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
దోషులకు వెంటనే శిక్ష పడే లా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత విధులు నిర్వహించే మహిళా ఫొటో జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్‌రెడ్డి, కార్యదర్శి కె.ఎన్.హరి ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో హెచ్‌యూజే నాయకులు సురేశ్, రవీందర్‌రెడ్డి, మహేశ్, వెంకట్రావ్, ఎం.రవికుమార్, ఆర్.ఎస్.జె. థామస్ పాల్గొన్నారు.