breaking news
Whats My Name
-
Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్?
బాబిడోస్ సింగర్ రిహాన రైటర్, నటి, ఫ్యాషన్ డిజైనర్ కూడా. ‘మ్యూజిక్ ఆఫ్ ది సన్’ ఆల్బమ్ ఆమెను లోకానికి పరిచయం చేసింది. ‘ఏ గర్ల్ లైక్ మీ’ రిహానను బిల్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో నిలిపింది. ‘గుడ్ గర్ల్ గాన్ బ్యాడ్’ ఆమెకు ఎంతో మంది అభిమానులను సంపాదించింది. ‘అంబ్రెల్ల’ పాట ‘గ్రామీ అవార్డ్’ను తెచ్చిపెట్టింది. మీరు ఏ కాస్త తీరిగ్గా ఉన్నా....‘వాట్స్ మై నేమ్’ పాటను అందుకోండి...‘యూ ఆర్ సో అమేజింగ్’ అని, ‘వుయ్ ఫౌండ్ లవ్’ పాటను ‘వుయ్ ఫౌండ్ లవ్ ఇన్ ఏ హోప్లెస్ ప్లేస్ ఎల్లో డైమండ్ ఇన్‌ది లైట్’ అంటూ బేషుగ్గా పాడుకోవచ్చు. ‘రిచెస్ట్ ఫిమేల్ మ్యూజిషియన్ ఆన్ ది ప్లానెట్’గా ఘనత సాధించిన రిహాన సెల్ఫ్–మేడ్ ఆర్టిస్ట్. రిహాన ‘రిచెస్ట్’ కావడానికి మ్యూజిక్ మాత్రమే కారణం కాదు...ఆమె మంచి ఎంటర్ప్రెన్యూర్ కూడా. చదవండి: పదేళ్ల బాలుడికి అంతర్జాతీయ యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు..!! -
ఆహా.. రిహానా!
చూడబోతే ఇదేదో లెస్ డ్రెస్ సీజన్‌లా ఉంది. సుందరాంగులు బ్యూటీ‘ఫుల్’ ఎపిసోడ్లతో పురుష పుంగవుల మతి పోగొడుతున్నారు. సెక్సీ సింగర్ రిహానా ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం టాప్‌లెస్‌గా దర్శనమిచ్చిందట! ‘వాట్స్ మై నేమ్’ వంటి హిట్ ఆల్బమ్స్‌తో మాంచి ఊపు మీదున్న ఈ ఇరవై ఆరేళ్ల సుందరి... ఐ-డీ మ్యాగజైన్‌పై తానిచ్చిన పోజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అందరితో షేర్ చేసుకుంది. ఓవర్‌సైజ్ డెనిమ్ ప్యాంట్ ధరించి... చేతులతో టాప్‌ను కవర్చేసుకున్న ఈ ఫొటో వెబ్‌లో వైరస్‌లా పాకేసింది. నైన్టీస్ హెయిర్ స్టైల్... డార్క్ కలర్ లిప్‌స్టిక్... స్మోకీ ఐ... ఇలా దేనికదే ప్రత్యేకంగా కనిపించేలా మేకప్ చేసుకుని ఉష్ణోగ్రతలు పెంచేస్తోందీ పిక్చర్..!