breaking news
well work
-
సోమిడిలో అస్థిపంజరం లభ్యం
మడికొండ : సోమిడి శివారులోని వ్యవసాయ బావిలో అస్థిపంజరం లభ్యమైన సంఘటన జరిగింది. మడికొండ ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం శాటిపల్లి అశోక్‌రావు అనే ఉపాధ్యాయుడు శనివారం తన వ్యవసాయ బావిలో క్రేన్ సహాయంతో పూడిక తీయడానికి వెళ్లాడు. పూడిక తీస్తుండగా మొదటగా చెత్త వచ్చిన అనంతరం ప్యాంట్, తర్వాత షర్టుతో పాటు అస్థి పంజరం వచ్చినట్లు తెలిపారు. వెంటనే మడికొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి ఇన్స్పెక్టర్ రాపెల్లి సంతోష్‌కుమార్, ఎస్సై కుమారస్వామి సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతుడికి ఎలాంటి అనవాళ్లు లేవని కేవలం అస్తిపంజరం మాత్రమే ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. స్థానిక వీఆర్ఓ సురేందర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మట్టిపెళ్లలు కూలి వ్యక్తి మృతి
బావి తీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ మట్టిపెళ్లలు కూలి వలస కూలీ మృతిచెందగా.. మరో కూలీకి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ బావి తీయిస్తున్న క్రమంలో మట్టి పెడ్డలు కూలడంతో బావిలో పనిచేస్తున్న వలస కూలీ మల్లయ్య(40) మృతిచెందాడు. అదే సమయంలో బావిలో పనిచేస్తున్న మరో కూలీకి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.