breaking news
weight problems
-
చాక్లెట్‌తో గుండెజబ్బులు దూరం...
కొత్త పరిశోధన చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరూ చాక్లెట్‌ను ఇష్టపడతారు. అయితే, బరువు పెరుగుతామనే భయంతో పెద్దవాళ్లలో చాలామంది చాక్లెట్ జోలికి పోవాలంటే వెనుకాడుతారు. చాక్లెట్ తినడానికి భయపడాల్సిందేమీ లేదని, పైగా రోజూ చాక్లెట్ తింటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్కాట్లాండ్లోని అబెర్డీన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 21 వేల మందిపై గడచిన పన్నెండేళ్లలో నిర్వహించిన పరిశోధనలు చాక్లెట్‌లోని సుగుణాలను నిగ్గు తేల్చాయి. చాక్లెట్ రుచి చూడని వారితో పోలిస్తే అడపా తడపా చాక్లెట్‌ను ఆస్వాదించే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 11 శాతం వరకు తక్కువగా ఉంటాయని, క్రమం తప్పకుండా రోజూ చాక్లెట్ తినే వారికి గుండెజబ్బుల ముప్పు 25 శాతం వరకు తగ్గుతుందని, అలాగే మరణానికి దారితీసే జబ్బులు వచ్చే అవకాశాలు 45 శాతం మేరకు తగ్గుతాయని ఈ పరిశోధనల్లో తేలింది. -
అమెరికాలో వైద్యం!
బాలీవుడ్ నాయికల్లో సూపర్‌స్టార్ ఎవరు? అంటే సమాధానం ‘కరీనా కపూర్’. కొత్తదనం కోసం పరితపించడం కరీనా ప్రత్యేకత. రెండుమూడేళ్ల క్రితం ఆమె జీరో సైజ్ చేశారు. అప్పట్నుంచీ బాలీవుడ్ కథానాయికలందరూ ఆమె బాటే పట్టారు. అయితే... ఇదంతా రెండుమూడేళ్ల నాటి ముచ్చట. ఇప్పుడైతే... ఆమె జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. దీపిక, కత్రినా, కంగనా... ప్రస్తుతం హంగామా అంతా వీరిదే. వీళ్ల వేగాన్ని అందుకోవడం కరీనాకు కష్టంగానే ఉంది. దానికి కారణం... పెళ్లయ్యాక ఆమె బరువు పెరగడమే. వైవాహిక జీవితం తన నట జీవితాన్ని పూర్తిస్థాయిలో డామినేట్ చేస్తోందని, దాంతో కెరీర్‌పై కరీనా సరిగ్గా ఏకాగ్రత చూపించలేకపోతోందని ఆమె సన్నిహితులే చెప్పుకుంటున్నారు. ఇటీవల కొన్ని సందర్భాల్లో మీడియాకు చిక్కిన కరీనా స్టిల్స్ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అందుకే... ఈ సమస్య నుంచి త్వరితగతిన బయటపడటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు కరీనా. ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా.... శరీరంలోని అదనపు కొవ్వును ఆరోగ్య కరంగా కరిగించే అత్యాధునిక చికిత్స ప్రస్తుతం అమెరికాలో అందుబాటులో ఉందని తెలుసుకొని, తన బరువును తగ్గించుకోవడం కోసం అమెరికా వెళ్లారామె. వెళ్లడమే కాదు, అక్కడే వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండి, తన బరువును తగ్గించుకుని, మళ్లీ నాజూకుగా, ముంబయ్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు కరీనా మునుపటి అందంతో మెరిసిపోతున్నారని బాలీవుడ్ టాక్. సాటి కథానాయికలకు దీటైన పోటీ ఇవ్వడానికి ప్రస్తుతం కరీనా సమాయత్తమవుతున్నట్లు వినికిడి.