breaking news
Web options Schedule
-
1 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గురువారం నుంచి చేపట్టాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. ఫీజుల వ్యవహారంలో తలెత్తిన గందరగోళం కారణంగా ప్రవేశాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మాత్రం గురువారం నుంచి వచ్చే నెల 3 వరకు యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. జూలై 1వ తేదీ నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించేలా రివైజ్డ్ షెడ్యూల్ జారీ చేసింది. ఫీజుల ఖరారులో గందరగోళంతో... రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే మూడేళ్లకు వార్షిక ఫీజు ఖరారు చేయాల్సిన టీఏఎఫ్ఆర్సీకి చైర్మన్‌ను నియమించడంలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో టీఏఎఫ్ఆర్సీ సభ్య కార్యదర్శి ఫీజుల ఖరారు కోసం నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని కాలేజీలు ఫీజులు ఖరారు చేయాలని కోర్టును ఆశ్రయించడంతో టీఏఎఫ్ఆర్సీ చైర్మన్‌ను నియమించి ఫీజులు ఖరారు చేసే వరకు యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని కోర్టు తీర్పు వెలువరిం చింది. అనంతరం ఆయా ఫీజుల్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటే తర్వాత సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేస్తే తల్లిదండ్రులపై భారం పడుతుందని, తర్వాత సర్దుబాటు చేసే అవకాశం ఉన్నా ముం దుగా ఆ భారం భరించాల్సిన పరిస్థితి వస్తుం దని భావించిన విద్యాశాఖ ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించింది. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ నియామకం జరిగి ఫీజులు ఖరారు చేసేవరకు పాత ఫీజులను అమలు చేయాలని కోరుతూ అప్పీలుకు వెళ్లనుంది. కాగా, తీర్పు కాపీ బుధవారం రాత్రి అందిందని, దీనిపై గురువారం అప్పీల్‌కు వెళ్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా వేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ నియామకానికి ముగ్గురు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేయాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ప్రతిపాదన పంపించనున్నట్టు తెలిపారు. ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. యథావిధిగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం బుధవారం వరకు 45,156 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్లుæ బుక్ చేసుకున్నారు. గురువారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. విద్యార్థులు జూలై ఒకటో తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. -
జేఈఈ మెయిన్ ర్యాంకులపై ఉత్కంఠ
ర్యాంకుల కోసం 10 లక్షల మంది విద్యార్థుల నిరీక్షణ ♦ 24నే వెల్లడించాల్సి ఉన్నా ఇంకా ప్రకటించని సీబీఎస్ఈ ♦ ఫలితంగా రెండోసారి మారిన వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ♦ నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయన్న జేఓఎస్ఏఏ ♦ రెండుసార్లు షెడ్యూల్ మార్పు జేఈఈ చరిత్రలో ఇదే తొలిసారి సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ర్యాంకుల ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ర్యాంకుల కోసం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు నిరీక్షిస్తున్నా సీబీఎస్ఈ వాటిని ఇంకా ప్రకటించలేదు. వాస్తవానికి ఈనెల 25 నుంచే వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉన్నా ర్యాంకుల విడుదలలో జాప్యం కారణంగా ఆ ప్రక్రియను సోమవారం (29వ తేదీ) నుంచి ప్రారంభిస్తామని ఉమ్మడి ప్రవేశాల కోసం ఏర్పాటైన జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జేఓఎస్ఏఏ) ఈనెల 24న పేర్కొంది. దీంతో ఆదివారం (28వ తేదీ) అర్ధరాత్రి వరకైనా ర్యాంకులు వెలువడతాయని విద్యార్థులు ఎదురుచూసినా అలా జరగలేదు. సీబీఎస్ఈ ర్యాంకులను ప్రకటించిన రెండు మూడు గంటల తరువాత వెబ్ ఆప్షన్ల లింకు అందుబాటులోకి వస్తుందని జేఓఎస్ఏఏ వెబ్సైట్లో పేర్కొంది. కానీ సోమవారం కూడా మెయిన్ ర్యాంకులు విడుదల కాకపోవడం, సోమవారం సాయంత్రం వరకు కూడా వెబ్ ఆప్షన్ల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు వెలువడకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెల కొంది. ఎట్టకేలకు సోమవారం రాత్రి వెబ్ ఆప్షన్ల షెడ్యూల్‌ను జేఓఎస్ఏఏ తిరిగి మార్చింది. మంగళవారం (30వ తేదీ) నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభిస్తామని పేర్కొంది. ఇలా ప్రవేశాల షెడ్యూలును 2 సార్లు మార్పు చేయడం జేఈఈ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. జూలై 7న ఫలితాలని తొలుత నోటిఫికేషన్.. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 4న ఆఫ్‌లైన్, 10, 11 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్షల్లో విద్యార్థుల స్కోర్‌ను ఏప్రిల్ 27న సీబీఎస్ఈ ప్రకటించింది. ఈ ఫలితాలను జూలై 7న ప్రకటిస్తామని సీబీఎస్ఈ మొదట్లో తన నోటిఫికేషన్లో ప్రకటించింది. అయితే ఈసారి ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో అన్నింటికీ ఒకేసారి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను ఈనెల 18న ప్రకటించింది. మరోవైపు జేఈఈ మెయిన్ ర్యాంకులను కూడా ఈనెల 24న ప్రకటించాలని తొలుత నిర్ణయించింది. పరీక్ష రాసిన 1.19 లక్షల మంది తెలుగు విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి జేఈఈ మెయిన్ కోసం 1,24,234 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,19,850 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 69,234 మంది దరఖాస్తు చేసుకోగా 66,596 మంది హాజరయ్యారు. ఆం ధ్రప్రదేశ్ నుంచి 55,000 మంది దరఖాస్తు చేసుకోగా 53,254 మంది పరీక్షకు హాజరయ్యారు.