భారత్‌కు మూడో స్థానం
బ్రెడా (నెదర్లాండ్స్): వోల్వో అంతర్జాతీయ అండర్-21 హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం తేలేందుకు షూటౌట్ అనివార్యమైంది. ఈ షూటౌట్లో ఇంగ్లండ్ క్రీడాకారిణులు ఐదు ప్రయత్నాలను భారత గోల్‌కీపర్ ఇందర్‌ప్రీత్ కౌర్ అడ్డుకోవడం విశేషం. మరోవైపు భారత్ నుంచి దీప్ గ్రేస్ ఎక్కా కీలకమైన గోల్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించింది.