breaking news
Vishwanath mahadesvar brhan
-
ముంబై మేయర్గా విశ్వనాథ్ మహదేశ్వర్
-
ముంబై మేయర్గా విశ్వనాథ్ మహదేశ్వర్
ముంబై: ముంబై మేయర్ పదవిపై సందిగ్ధతకు తెరపడింది. బీజేపీ మద్దతుతో శివసేన కార్పొరేటర్ విశ్వనాథ్ మహదేశ్వర్ బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) మేయర్గా బుధవారం ఎన్నికయ్యారు. దీంతో ఎన్నికల సందర్భంగా విడిగా పోటీచేసిన ఇరుపార్టీలు మళ్లీ ఏకమయ్యాయన్న సంకేతాలిచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి విఠల్ లోకారేను 171–31 ఓట్ల తేడాతో ఓడించిన మహదేశ్వర్ ముంబైకి 76వ మేయర్ కానున్నారు. శివసేనకే చెందిన హేమంగి వోర్లికర్ ఉప మేయర్గా ఎన్నికయ్యారు.