breaking news
Vinayak mete
-
రోడ్డు ప్రమాదంలో మరాఠా నాయకుడు వినాయక్ మేటే మృతి
ముంబై: మహారాష్ట్రలోని మాజీ శాసన మండలి ఎమ్మెల్సీ వినాయక్ మేటే కారును ఒక వాహనం ఢీ కొనడంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో ఆయనను నేవీ ముంబై సమీపంలోని ప్రవైట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ హైవే పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం స్థలంలో కారు చాలా దారుణంగా నుజ్జునుజ్జు అయిపోయింది. దీంతో కారులో ఉన్నవారందరికి తీవ్ర గాయాలపాలయ్యారు. వినాయక మేటే బీజేపీ మిత్రపక్షమైన శివసంగ్రామ్ చీఫ్‌గా కూడా పనిచేశారు. ఈ ప్రమాదంలో ఆయన భద్రత కోసం మోహరించి ఉన్న ఒక పోలీసు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హుటాహుటిన ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. మహారాష్ట్ర మాజీ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడు అయిన మేటేకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ కూడా మేటే మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు రాజకీయ విషయాల కంటే సామాజిక సమస్యలపైనే ఎక్కువ దృష్టి సారించేవారిన కాంగ్రెస్ నాయకుడు ఆశోక్ చౌహన్ అన్నారు. మరాఠా రిజర్వేషన్ల కోసం విశేష కృషి చేసిన గొప్పవ్యక్తి అని చెప్పారు. (చదవండి: ప్రతి ఇంటి పై త్రివర్ణ పతాకం పెట్టడం కాదు.... గుండెల్లో ఉండాలి!) -
మిత్రుల ఆశలపై నీళ్లు చల్లిన బీజేపీ
సాక్షి, ముంబై: బీజేపీ వైఖరిపై స్వాభిమాని షేట్కారీ సంఘటన్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, ఆర్పీఐ పార్టీల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రి మండలి విస్తరణ కోసం ఎదురు చూస్తున్న వీరికి బీజేపీ వైఖరితో ఆశలు సన్నగిల్లుతున్నాయి. నాలుగు విధాన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న మిత్రులకు బీజేపీ మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. విధానమండలికి ఎన్నికై ఆ తరువాత మంత్రి పదవికి ఎర వేయాలనుకున్న మిత్రుల ఆశలను బీజేపీ మొగ్గలోనే తుంచివేసింది. మూడు స్థానాల్లో స్వయంగా పోటీ చేయాలని, మరో స్థానం శివసేనకు వదిలేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే 2017 ప్రారంభంలో జరగబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రామ్‌దాస్ ఆఠవలేకు చెందిన ఆర్పీఐకి ఓ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అందువల్ల మండలి స్థానాల్లో ఒకటి ఆర్పీఐకి కేటాయించనున్నట్టు సమాచారం. ఇక శివసంగ్రామ్ పార్టీ నాయకుడు వినాయక్ మెటే ఇటీవలే బీజేపీ సభ్యత్వం తీసుకోవడంతో ఆయనకు కూడా మంత్రి పదవి లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందుకు గాను వినాయక్ మెటే బీజేపీ టికెట్‌పై శాసనమండలికి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మూడో స్థానంలో బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీని బరిలోకి దింపనున్నారని తెలిసింది. దీనిని బట్టి స్వాభిమానిషేట్కారీ సంఘటన్, రాష్ట్రీయ సమాజ్ పార్టీలకు కేబినెట్లో చోటు లేనట్టేనని భావిస్తున్నారు. లోకసభతోపాటు శాసనసభ ఎన్నికల్లో విజయం తర్వాత మిత్రపక్షాలకు బీజేపీ నుంచి సరైన ఆదరణ లభించడంలేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి. శివసేనను వీడి తప్పుచేశాం..! అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివసేనను వీడి తప్పుచేశామన్న భావనను ఆర్పీఐ నాయకుడు రామ్‌దాస్ ఆఠవలే వ్యక్తంచేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శివసేనతో ఉండి ఉంటే తమ పార్టీకి సరైన న్యాయం జరిగేదని పేర్కొన్నారు. శివసేనతో పొత్తుపెట్టుకుని ఉంటే ఆ పార్టీ స్థానాలు మరో 30 నుంచి 35 పెరిగేవి. దీంతో బీజేపీ ద్వితీయ స్థానంలో నిలిచేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రం, కేంద్రంలో ఆర్పీఐని బాగస్వామ్యం చేసుకుంటామని బీజేపీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.