Vietnam PM
-
భారత్, వియత్నాం మధ్య సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం
న్యూఢిల్లీ: ఇరుదేశాల మధ్య వచ్చే నాలుగేళ్లలో 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యమే లక్ష్యంగా భారత్, వియత్నాం మరో అడుగు ముందుకేశాయి. మూడ్రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న వియత్నాం అధ్యక్షుడు టో లామ్ బుధవారం హైదరాబాద్‌హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు వాణిజ్యం, రక్షణ, అరుదైన మూలకాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, అరుదైన భూఅయ స్కాంతాలు, ఫార్మాసూటికల్స్, విద్య, బ్యాంకింగ్, సాంస్కృతిక సంబంధాలకు సంబంధించి మొత్తంగా 13 ఒప్పందాలపై సంతకాలుచేశారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం పెరగడంతో ఇండో–పసిఫిక్‌లో మారుతున్న పరిణామాలపై ఇరుదేశాధినేతలు చర్చించుకున్నారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని నేతలు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘దశాబ్దకాలం క్రితమే ఆసియాన్ కూటమి నుంచి భారత్‌కు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామిగా మారిన తొలి దేశం వియత్నాం. ఈ పదేళ్లలో మన రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. అవి ఇప్పుడు విస్తృతస్థాయి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఎదిగాయి. భవిష్యత్తులో ఈ బంధాన్ని సమున్నత శిఖరాలకు చేరుద్దాం. సాంస్కృతిక సంబంధాలు మొదలు అనుసంధానత, సామర్థ్యం పెంపు, భద్రత, సుస్థిరాభివృద్ధి, సరఫరా గొలుసుల పటిష్టత దాకా ప్రతిరంగంలో సమన్వయం పెంచుకుంటూ సమున్నత స్థాయికి ఎదుగుదాం. 2030 ఏడాదినాటికి 25 బిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్య సామర్థ్యం సాధిద్దాం’’అని మోదీ అన్నారు. మా ద్రాక్ష రుచి చూస్తారు.. ‘‘ఇకపై భారతీయ ఔషధాలు వియత్నాంవాసులకూ అందుబాటులోకి వస్తాయి. భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తులు, పశుసంబంధ ఉత్పత్తులు ఇప్పుడు వియత్నాం ప్రజలకు చవగ్గా దొరకనున్నాయి. భారతీయ ద్రాక్ష, దానిమ్మ రుచిని త్వరలోనే వియత్నాంవాసులు రుచి చూడబోతున్నారు. ఇండియా–ఆసియాన్ వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరికల్లా నవీకరిస్తాం. అరుదైన మూలకాలు, భూఅయస్కాంతాలు మొరలు ఇంధనరంగంలో సహకాం ద్వారా కీలక వాణిజ్యం, పెట్టు బడుల్లో సరస్పర సహకారాన్ని మరింత పెంపొందిస్తాం. ఇరుదేశాల కేంద్ర బ్యాంకుల మధ్య సహకారాన్ని పెంచుతాం. ఇండియాలో అమలవుతున్న యూపీఐ పేమెంట్ వ్యవస్థను, వియత్నాంలోని పాస్ట్ పేమెంట్ సిస్టమ్‌తో అనుసంధానిస్తాం. ఇరు దేశాల రాష్ట్రాల మధ్య, నగరాల మధ్య సైతం అనుసంధానం రెట్టింపుకానుంది’’అని మోదీ అన్నారు. -
రక్షణ బంధానికి 3,400 కోట్లు
-
రక్షణ బంధానికి 3,400 కోట్లు
- వియత్నాంతో 12 ఒప్పందాలపై భారత్ సంతకాలు - సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై అంగీకారం హనోయ్: చైనా, రష్యాల తర్వాత వియత్నాంతో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం భారత్ శనివారం పలు ఒప్పందాలు చేసుకుంది. ప్రధాని మోదీ వియత్నాం పర్యటనలో భాగంగా కీలక అంశాలపై చ ర్చించారు. రక్షణ సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వియత్నాంకు భారత్ రూ. 3400 కోట్ల రుణసాయం చేయనుంది. ఇరు దేశాలు 12 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వియత్నాం ప్రధాని గుయేన్ ఫుక్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత మోదీ మీడియాతో మాట్లాడుతూ..‘పూర్తి స్థాయి ద్వైపాక్షిక సహకారం కోసం చర్చలు జరిపాం. ఈ ప్రాంతంలో రెండు దేశాలు కీలకం కావడంతో సహకారం పెంచుకోవడంతో పాటు బలోపేతానికి అంగీకరించాం.’ అని మోదీ పేర్కొన్నారు. రక్షణ, ఐటీ రంగాల్లో తోడ్పాటు చర్చల అనంతరం రక్షణ, ఐటీ, అంతరిక్షం, సైబర్ భద్రత వంటి రంగాల్లో 12 ఒప్పందాలపై ఇద్దరు ప్రధానుల సమక్షంలో సంతకాలు జరిగాయి. సముద్రంలో గస్తీ బోట్ల నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. వియత్నాం తీర రక్షక దళం కోసం భారత్‌కు చెందిన ఎల్అండ్టీ బోట్లను నిర్మించనుంది. నాహ్ త్రాంగ్‌లోని టెలీకమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయంలో సాఫ్ట్వేర్ పార్కు కోసం ప్రధాని మోదీ రూ. 34 కోట్ల సాయాన్ని ప్రకటించారు. మోదీ మాట్లాడుతూ... ’నూతన వాణిజ్యం, వ్యాపార అవకాశాల్ని వినియోగించుకుంటూ 2020 నాటికి రూ. లక్ష కోట్ల వాణిజ్యం లక్ష్యాన్ని సాధించాలి. భారత్ చేపడుతున్న కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలంటూ వియత్నాం కంపెనీల్ని ఆహ్వానించాను. ’ అని మోదీ హామీనిచ్చారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో వియత్నాం కలిసి పనిచేసేందుకు అంతరిక్ష సహకారంపై ఒప్పందం అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ముఖ్య నేతలతో మోదీ భేటీ తన పర్యటనలో మోదీ వియత్నాంకు చెందిన పలు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం విషయంలో భారత్ వైఖరిని ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీని పూర్తిగా సమర్దిస్తున్నానని వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ పేర్కొన్నారు. ఇరు దేశాల సంబంధాలపై ప్రధాని మోదీతో ఆయన చర్చించారు. అంతర్జాతీయ వేదికలపై సహకారాన్ని మెరుగుపర్చుకోవాలని వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గుయేన్ త్రాంగ్ కోరారు. పర్యటనలో భాగంగా మోదీ చారిత్రక పగోడాను సందర్శించారు. వియత్నాం ప్రధానితో కలిసి చేపలకు మేత వేశారు. పర్యటన ముగించుకున్న మోదీ జీ 20 సదస్సు కోసం శనివారం చైనాలోని హంగ్జౌకు చేరుకున్నారు. ఎన్ఎస్జీలో భారత్‌కు చోటు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా సహకారంతో నిర్మిస్తోన్న ఎకనామిక్ కారిడార్‌పై నేడు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మోదీ చర్చించనున్నారు.


