హీరోయిన్‌కు పాప పుట్టింది..
చెన్నై: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తండ్రిగా ప్రమోషన్ తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా 'ప్రేమిస్తే' హీరోయిన్ సంధ్య కూడా ఓ చిన్నారికి జన్మనిచ్చింది. సంధ్యకు పాప పుట్టిన విషయాన్ని ఆమె స్నేహితురాలు నటి సుజ వరుణీ మంగళవారం తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బుజ్జి పాపాయితో పాటు సంధ్య దంపతులతో తాను దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. కాగా పాప పుట్టిన తేదీపై క్లారిటీ లేదు.
గత ఏడాది సంధ్య ఐటీ ఉద్యోగి వెంకట్ చంద్రశేఖరన్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గ్రాండ్‌గా వివాహం చేసుకోవాలనుకున్నా... అప్పడు చెన్నైలో వర్షాలు, వరదలు కారణంగా... పెళ్లి వేదికను మార్చుకున్నారు. కేరళలోని ప్రముఖ గురువాయూర్ దేవాలయంలో 2015 డిసెంబర్ 6న వీరి వివాహం సింపుల్‌గా జరిగింది. పెళ్లి తర్వాత సంధ్య నటనకు దూరంగా ఉంది. 2004లో తమిళ చిత్రం కాదల్ (తెలుగులో 'ప్రేమిస్తే') ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన సంధ్య తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళ, కన్నడంతో కలిపి సుమారు 40 చిత్రాల్లో నటించింది. తెలుగులో 'అన్నవరం' చిత్రంలో పవన్ కల్యాణ్ సోదరిగా నటించింది.
Very happy for my loveable friend #Sandhya n #Venkat as she blessed with baby girl ! My heartily wishes for you dear