Vema Reddy
-
Donthireddy: తాడేపల్లి హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదే.. ! చంద్రబాబు పచ్చి అబద్ధాలు
-
బాబూ.. రెవెన్యూ రికార్డులు చూడు.. వాస్తవం ఇదే: దొంతిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలోని హెలిప్యాడ్ స్థలం ప్రభుత్వానిదేనని.. చంద్రబాబు ఒకసారి రెవెన్యూ రికార్డులు చూస్తే వాస్తవాలు తెలుస్తాయని వైఎస్సార్సీపీ మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 223 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టంగా ఉందని.. ఆ స్థలం రైల్వేది.. వ్యవసాయ భూమి కానేకాదన్నారు.‘‘గతంలో ఆ భూమిని రైల్వే వాళ్లు ప్యారీ కంపెనీకి లీజుకు ఇచ్చారు. కొంతకాలం తర్వాత ఆ సంస్థ మూత పడటంతో తిరిగి ఆ భూమి రైల్వే పరిధిలోకి వెళ్లిపోయింది. మధ్యలో ప్రయివేటు వ్యక్తికి భూమి ఎలా వెళ్తుంది?. ఆ స్థలం తనది అంటున్న వ్యక్తి అసలు రైతు కానే కాదు. అబద్ధాన్ని పదేపదే చెప్తే నిజం అని నమ్మే రోజులు పోయాయి. వాస్తవాలు ఏంటో జనానికి తెలిసిపోతోంది’’ అని దొంతిరెడ్డి వేమారెడ్డి పేర్కొన్నారు.‘‘తాడేపల్లిలోని వివాదాస్పద భూమి ఇప్పటికీ రైల్వే రికార్డుల్లోనే ఉంది. సర్వే నంబర్లు 223, 226 సీ2లో 10.4 ఎకరాలు రెవెన్యూ, మున్సిపాలిటీ రికార్డుల్లో ఉన్నాయి. ఆ భూమిని 22ఏలో తమ ప్రభుత్వం పెట్టలేదు.. అది 2015 లోనే నమోదు అయ్యింది. 26-05-2016న ఆ భూమి గుంటూరు కలెక్టర్ రికార్డుల్లో నోటిఫై అయ్యింది. ఆ భూమిలో ఎప్పుడూ వ్యవసాయం జరగలేదు. గతంలో ఈఐడీ ప్యారీ ఫర్టిలైజర్ కంపెనీ నడిచింది. వాస్తవాలు తెలుసుకోకుండా తమ పార్టీపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు.ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాల అమలుపై దృష్టి పెట్టాలి. రైతులకు పరిహారం, సబ్సిడీలు అందడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం 20 నెలల్లో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రభుత్వం తీసుకున్న అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలి. రైల్వే భూమిని ఇతరులకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని వేమారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. -
‘బాబూ.. రైతుల జీవితాలతో ఆటలా?’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా? అని ప్రశ్నించారు. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానిలో రైతు రామారావు మృతి అత్యంత విచారకరం. రాజధానిలో ఇలాంటి రామారావులు ఇంకా ఎంతమంది బలి కావాలి?. ఇప్పటికే 30వేల మంది రైతుల నుండి భూమి తీసుకున్నారు. ఇంకా భూములు, ఇళ్లు తీసుకుంటామంటున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా?. భూమిని లాగేసుకుంటే రైతు ఎంత ఆవేదన చెందుతాడో అర్థం చేసుకోలేరా?. రైతు రామారావు నుండి భూమి, ఇంటితోపాటు చివరికి ఆయన ప్రాణం కూడా తీసుకున్నారు. రూ.2.77 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు రాజధానిలో ఏం అభివృద్ధి చేశారు?.ఏ రైతుల సమస్యలు పరిష్కారం చేశారు?. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతు కుటుంబం నుండి వచ్చిన చంద్రబాబుకు రైతుల బాధలు అర్థం కావా?. భూ సమీకరణ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఏ ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదు?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?. మొదట భూములు ఇచ్చిన వారికే ఏమీ చేయలేని చంద్రబాబు.. మళ్ళీ భూసేకరణ చేస్తామని ఎలా అంటారు?. చంద్రబాబు తన పద్దతి మార్చుకోవాలి.ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలి?. చంద్రబాబు రాజధాని రైతుల జీవితాలను అగమ్యగోచరం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమనే రైతులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారే గానీ ఏఒక్క సమస్య కూడా పరిష్కారం కావటం లేదు. ఇంకా ఎంత కాలం అబద్దాలు, మాయ మాటలతో కాలం వెళ్లదీస్తారు?. రైతు రామారావు చివరి మాటలకైనా విలువ ఇవ్వండి. రైతుల సమస్యలు పరిష్కరించండి’ అని హితవు పలికారు. -
అమరావతి రాజధాని వరద ముంపునకు గురైంది: దొంతిరెడ్డి వేమారెడ్డి
-
‘ఏపీలో స్థానిక సంస్థలు నిర్వీర్యం’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయితీ విభాగం అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ పంచాయతీరాజ్‌లకు సువర్ణ అధ్యాయం ప్రారంభమైన రోజన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో పంచాయితీల కరెంట్ బిల్లులు చెల్లించకుండా మినహయింపు ఇచ్చారన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే పంచాయితీలు కూడా కరెంట్ బిల్లులు కట్టాలంటూ వచ్చిన డబ్బుల్ని లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు సమాంతరంగా జన్మభూమి కమిటీలను నడుపుతున్నారని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న వారిని పక్కన పెట్టి పార్టీ నాయకులతో స్థానిక సంస్థల్ని నడపటం చాలా దారుణమన్నారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటుందన్నారు. పంచాయితీల్లో కార్మికులకు మూడు నెలల నుంచి జీతాలు లేవన్నారు. కార్మికులు జీతాలు ఇవ్వకుండా స్వచ్ఛ భారత్‌లో స్వచ్ఛత ఎక్కడ నుంచి వస్తుందన్నారు. మంత్రి లోకేష్ పంచాయితీల్లో రోడ్లు వేశామని చెబుతున్నారు.. ఎక్కడ వేశారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఉద్యోగులు కడుపుమంటతో రగిలిపోతున్నారని తెలిపారు. ఉద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని .. దయచేసి స్థానిక సంస్థల్ని బతుకనివ్వాలని ఆయన కోరారు. -
'చివరకు మిగిలేది’ నవలను సినిమాగా చేయాలని ఉంది
‘‘ఓ కారు డ్రైవర్ స్నేహం నా కెరీర్‌ని మలుపు తిప్పింది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న నా కలకు మార్గం ఆ డ్రైవర్ చూపించాడు. రహీమ్ అనే ఆ డ్రైవర్ నన్ను రచయిత పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్‌గా చేర్చాడు’’ అని రచయిత వేమారెడ్డి చెప్పారు. పోసాని దగ్గర రైటింగ్ అసిస్టెంట్‌గా, తర్వాత సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వేమారెడ్డి ‘తడాఖా’, ‘రేసుగుర్రం’ తదితర చిత్రాలకు సంభాషణలు రాశారు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన కెరీర్ గురించి వేమారెడ్డి వివరిస్తూ -‘‘నాకు మొదట్నుంచీ దర్శకత్వం మీద మక్కువ ఉంది. రచయితగా సంపాదించిన అనుభవంతో డైరక్షన్ చేస్తున్నాను. ఎమ్మెస్ రాజుగారు, సుమంత్ అశ్విన్ కథ వినగానే అంగీకరించారు. నా స్నేహితులే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహజీవనం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంది. ఇప్పటికి 50 శాతం సినిమా పూర్తయ్యింది’’ అని చెప్పారు. చిన్నప్పట్నుంచీ పుస్తకాలు చదవడం బాగా అలవాటని, ఎక్కడైనా బుక్ ఫెస్టివల్ జరిగితే అక్కడికి వెళ్లిపోతుంటానని అన్నారు. తాను చదివిన నవలల్లో ‘చివరికి మిగిలేది’ బాగా ఆకట్టుకుందని, దాన్ని కొంచెం సినిమాటిక్‌గా మార్చి, సినిమా చేయాలని ఉందని అన్నారు.


