breaking news
Vangaveeti Narendra
-
కూటమి పాలనలో డ్రగ్స్ డెన్గా ఏపీ: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ డెన్గా కూటమి సర్కార్ మార్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పేకాట క్లబ్లను కూడా నిర్వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి పేకాట ఆడుతున్నారని.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ‘‘హోం మంత్రి.. పోలీసులను వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులకే ఉపయోగిస్తున్నారు. డ్రగ్స్ అరికట్టాం అంటున్న చంద్రబాబు, అనిత ఇప్పుడు దొరుకుతున్న డ్రగ్ర్కి ఏం సమాధానం చెప్తారు?. ఢిల్లీ నండి డ్రగ్స్ ఏపీకి వస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు?. జగన్ హయాంలో డ్రగ్స్, గంజయిని అరికట్టడానికి సెబ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ఏం చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదు’’ అని నరేంద్ర నిలదీశారు.‘‘ఈ విచ్చలవిడి డ్రగ్ర్ని నిలిపేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. విద్యా సంస్థల దగ్గర్లో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ వాడటం మొదలుపెడితే యువత తీవ్రంగా నాశనం అవుతుంది. ప్రభుత్వ అండదండలతోనే డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తోంది. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. వారెవరో బయట పెట్టాలి. రాష్ట్రాన్ని దౌర్భాగ్యకర పరిస్థితిలోకి తీసుకెళ్లారు’’ అంటూ వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు. -
లక్ష్మీ నాయుడు హత్యలో మొదటి ముద్దాయి పవన్ కల్యాణే
-
ప్రశ్నిస్తే దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్
-
‘పవన్.. సుగాలి ప్రీతికి న్యాయం, 30 వేల మంది అదృశ్యం సంగతి ఏమైంది?’
తాడేపల్లి : రాజ్యాంగం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏపీలో జరుగుతున్న దారుణాలు కనబడుతున్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్12) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. ‘ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా?, ఇదేనా రాజ్యాంగ బద్దమైన పాలన అంటే?, లక్షల పుస్తకాలు చదివిన పవన్ రాజ్యాంగాన్ని చదివారా?, ఒకసారి చదివితే విషయాలు తెలుస్తాయి. మచిలీపట్నం మంగినపూడిలో మా పార్టీ నేత గిరి పై జనసేన నేతల దాడి అమానుషం. పెద్దమనిషిని మోకాళ్ళపై పెట్టి దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది?, దాడి చేసిన జనసేన గూండా కొరియా శీను జనసేన నేత పార్టీలో చాలా కీలకం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చేసిన కామెంట్ మేరకు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి. 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారన్న మీ వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్న అడిగితే మా పార్టీ నేతపై దాడి చేశారు. ఇలా దాడి చేసి కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్ కళ్యాణ్?, కూటమి వచ్చాక ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇది మీకు తెలీదా.?, మా నాయకుడు వైఎస్ జగన్కు రాజ్యాంగం తెలుసు కాబట్టే ప్రతిపక్ష హోద అడిగారు. అందుకే ఆయన న్యాయ బద్దంగా పోరాటం చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: మా పవనన్ననే ప్రశ్నిస్తావా?..


