
తాడేపల్లి : రాజ్యాంగం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఏపీలో జరుగుతున్న దారుణాలు కనబడుతున్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్12) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. ‘ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా?, ఇదేనా రాజ్యాంగ బద్దమైన పాలన అంటే?, లక్షల పుస్తకాలు చదివిన పవన్ రాజ్యాంగాన్ని చదివారా?, ఒకసారి చదివితే విషయాలు తెలుస్తాయి.
మచిలీపట్నం మంగినపూడిలో మా పార్టీ నేత గిరి పై జనసేన నేతల దాడి అమానుషం. పెద్దమనిషిని మోకాళ్ళపై పెట్టి దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది?, దాడి చేసిన జనసేన గూండా కొరియా శీను జనసేన నేత పార్టీలో చాలా కీలకం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చేసిన కామెంట్ మేరకు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి. 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారన్న మీ వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాలి.
ఈ ప్రశ్న అడిగితే మా పార్టీ నేతపై దాడి చేశారు. ఇలా దాడి చేసి కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్ కళ్యాణ్?, కూటమి వచ్చాక ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇది మీకు తెలీదా.?, మా నాయకుడు వైఎస్ జగన్‌కు రాజ్యాంగం తెలుసు కాబట్టే ప్రతిపక్ష హోద అడిగారు. అందుకే ఆయన న్యాయ బద్దంగా పోరాటం చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:
మా పవనన్ననే ప్రశ్నిస్తావా?..