నాటుపడవ బోల్తా: ముగ్గురి గల్లంతు
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని మంచంగిపుట్టు మండలం పాట్నాపటల్ పుట్టులో గురువారం నాటుపడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు గల్లంతయ్యారు.
వనకఢిల్లీ సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. కాగా, గల్లంతైనవారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.