breaking news
Uttar Pradesh Governor
-
యూపీ గవర్నర్‌కు అస్వస్థత
లక్నో : ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీనొప్పితో బాధపడుతున్న ఆదివారం ఆయన చికిత్స నిమిత్తం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుషన్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు రామ్ నాయక్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అటల్ బిహారీ వాజ్‌పేయ్ కేబినెట్ లో రామ్ నాయక్ పెట్రోలియం-సహజ వాయువులు మంత్రిగా పనిచేశారు. 1994వ సంవత్సరంలో కేన్సర్ బారిన పడ్డ ఆయన క్రీయశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. -
దేవుడికే తప్ప పోలీసులకు సాధ్యం కాదు
లక్నో: మహిళలపై దాడులు, అత్యచార సంఘటనలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములయాం సింగ్ యాదవ్ తరహాలో ఆ రాష్ట్ర గవర్నర్ అజీజ్ ఖురేషీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొత్తం పోలీస్ వ్యవస్థనంతటినీ మహిళల రక్షణ కోసం మోహరించినా అత్యాచారాలను ఆపలేరని ఖురేషీ అన్నారు. ఎక్కడో ఒక చోట అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయని ఖురేషీ చెప్పారు. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే దేవుడే దిగివచ్చి కాపాడాలని, లేకుంటే సాధ్యంకాదని ఖురేషీ అన్నారు. దీనిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉన్నత పదవిలో ఉన్న ఖురేషీ ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం సరికాదని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారాలు, దాడులతో శాంతిభద్రతలు క్షీణిస్తుంటే.. ములయాం మాత్రం 21 కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చాలా తక్కువేనని వ్యాఖ్యానించారు.