breaking news
Urdu DSC
-
ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ కలేనా..?
మదనపల్లె సిటీ: రాష్ట్రంలో ద్వితీయ అధికార భాష అయన ఉర్దూ నేడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలో అనేక ఉర్దూ పాఠశాలలు సింగిల్ టీచర్లతో మరికొన్ని పాఠశాలలు అసలు టీచర్లే లేకనే పని చేస్తున్నాయి. ఉర్దూ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని అనేకమంది నిరుద్యోగ ఉర్దూ ఉపాధ్యాయులు చంద్రబాబు నాయు డి పాదయాత్ర సమయంలో కోరారు. దీనిపై అప్పట్లో స్పందించి ఆయన టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగిసింది .. ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం పూర్తయింది. కానీ ఇంత వరకు ప్రత్యేక డీఎస్సీ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా టీచర్లు లేక అనేక ఉర్దూ పాఠశాలలు మూతపడగా, ఆయా పాఠశాలల్లోని ఉర్దూ విద్యార్థులు డ్రాప్ఔట్లుగా మారుతున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలో ముస్లిం మైనార్టీల కోసం 200 గురుకుల పాఠశాలలు మంజూరు చేయగా రాష్ట్రంలో ఒక్క ఉర్దూ పాఠశాల కూడా కొత్తగా మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో తమకు కావాల్సింది ప్రత్యేక పాఠశాలలు, అందులో గుణాత్మక విద్క అందించేందుకు టీచర్లు కానీ.. ఏడాదికోసారి రంజాన్ మాసంలో ఇఫ్తార్, రంజాన్ తోఫాలు ఇవ్వడం కాదని ముస్లిం మైనారి టీలు విమర్శిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో 205 ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి. 27 ఉన్నత పాఠశాలలు, 38 ప్రాథమికోన్నత ,140 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో అనే క పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు ఉండగా, మరి కొన్ని పాఠశాలల్లో అసలు టీచర్లే లేరు. ముఖ్యం గా ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఉర్దూ పాఠశాలల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ నియోజకవర్గంలోనే అనేక ఉర్దూ పాఠశాలల్లో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కుప్పం మండలంలోని రాగిమానుమిట్ట ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో 8 తరగతుల్లో వంద మంది ఉర్దూ విద్యార్థులు ఉండగా ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరు. అలా గే ఇదే మండలంలో కంగుంది పాఠశాల టీచర్లు లేక మూతపడ్డాయి. నగిరి మండలం వేలవాడి ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్క టీచరు కూడా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఎర్రావారిపాళెం మండలంలో ఉర్దూ పాఠశాలలు టీచర్లు లేక ఇప్పటికే మూతపడ్డాయి. అయినా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. భర్తీకి నోచుకోని ఉర్దూ పోస్టులు ఉపాధ్యాయ నియామకాల్లో రోస్టర్ ప్రకారం దాదాపు 40 శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ, డీ రిజ్వర్డ్ కేటగిరిలకు కేటాయించడంతో ఆయా విభాగాల్లో ఉర్దూ అర్హత కలిగిన అభ్యర్థులు లేరు. దీంతో ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. గతంలో ఇలాంటి కేటగిరి లలో డి రిజర్వుడ్ ద్వారా ఉర్దూ పోస్టులను భర్తీ చేసి టీచర్ల కొరతను తీర్చేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వారు వాపోతున్నారు. -
తక్షణమే ప్రత్యేక ఉర్దూ డీఎస్సీ
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ► మణికొండలో 40 కోట్లతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ ► 21 కోట్లతో అనీస్–ఉల్–గుర్బా స్థలంలో ముస్లింల అనాథాశ్రమం ► మక్కా మసీదు సమగ్రాభివృద్ధికి రూ. 8.50 కోట్లు ► ఇమామ్, మౌజమ్ల గౌరవ భృతి రూ. 1,500కు పెంపు ► ఉర్దూలో నీట్ నిర్వహించాలని ప్రధానికి లేఖ ► మైనారిటీల సంక్షేమంపై ముఖ్యమంత్రి నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్ ఉర్దూ మీడియం పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి తక్షణమే ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంస్థల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామిక్ కేంద్రంతో కూడిన కన్వెన్షన్ హాలు నిర్మిస్తామని ప్రకటించారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై శనివారం మైనారిటీల సంక్షేమ శాఖ సలహాదారులు ఏకే ఖాన్, ఆ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్‌తో చర్చించిన కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ మణికొండలోని ఆరు ఎకరాల వక్ఫ్ స్థలంలో రూ. 40 కోట్ల అంచనా వ్యయంతో ఇస్లామిక్ సెంటర్ నిర్మిస్తామన్నారు. ముస్లింలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసే వేదికగా ఇస్లామిక్ సెంటర్ ఉపయోగపడాలని, దీనికోసం మంచి డిజైన్లు తయారు చేయాలని ఆదేశించారు. త్వరలో దీనికి శంకుస్థాపన చేస్తానన్నారు. రూ.21 కోట్లతో ముస్లింల అనాథాశ్రమం నాంపల్లిలో అనీస్–ఉల్–గుర్బా స్థలంలో ముస్లింల కోసం అనాథశ్రయం నిర్మించడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఫైలుపై శనివారం సంతకం చేశారు. ఇప్పటికే 4 వేల గజాల స్థలాన్ని అనీస్–ఉల్–గుర్బాకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని, త్వరలో శంకుస్థాపన చేయాలని సీఎం నిర్ణయించారు. ఉర్దూలో ‘నీట్’పై ప్రధానికి లేఖ... నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను ఉర్దూలోనూ నిర్వహించాలని ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా భారీగా ఉర్దూ మధ్యమంలో చదివే విద్యార్థులున్నారని, వారికి ఉర్దూలో పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించామని, పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం పిల్లలు ఉర్దూ భాషలోనే విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే అనేక ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహిస్తున్నందున, ఉర్దూ మాధ్యమంలోనూ పరీక్ష నిర్వహించాలని కోరారు. మరికొన్ని నిర్ణయాలు/ఆదేశాలు... – హైదరాబాద్‌లోని మక్కా మసీదు సమగ్రాభివృద్ధికి రూ. 8.48 కోట్లు మంజూరు. మక్కా మసీదుకు అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు జరపాలని ఆదేశం. – రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్, మౌజమ్ల గౌరవ భృతిని నెలకు రూ.1,000 నుంచి రూ.1,500కు పెంచుతూ ఉత్తర్వులు జారీ. వచ్చే ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్ 1) నుంచి పెంచిన భృతి అందించాలని అధికారులకు సూచన. – ఫలక్‌నుమాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశం. డిగ్రీ కళాశాల నిర్వహణ ఏర్పాట్లకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. – ముస్లింల కోసం ప్రత్యేక ఐటీ సెజ్ ఏర్పాటుకు ఆదేశం. అనువైన స్థలం ఎంపిక చేయాలని అధికారులకు సూచన. – రాష్ట్రంలోని 17 మైనారిటీ జూనియర్ కళాశాలలు, నాలుగు మైనారిటీ డిగ్రీ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులకు నిధులు మంజూరు చేయాలని ఆదేశం. ఈ విద్యా సంస్థల్లో చదివే విద్యారులు ఫీజు చెల్లించే అవసరం లేకుండా చూడాలని సూచన.