తెలంగాణకు ఒకరోజు వేతనం విరాళం
హైదరాబాద్: కొత్తగా ఏర్పడే తెలంగాణ ప్రభుత్వానికి ఒక రోజు మూల వేతనం విరాళంగా ఇవ్వాలని తెలంగాణ ఉపాధ్యాయ సమాఖ్య నిర్ణయించింది. తెలంగాణ అభివృద్ధి కోసం తమ వంతు సహాయం అందించాలని సమాఖ్య భావించింది.
ఉపాధ్యాయుల ఒక రోజు మూల వేతనం 20 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. తెలంగాణ ఉపాధ్యాయ సమాఖ్య ఈ నిర్ణయం తీసుకోవడాన్ని పలువురు అభినందించారు.