breaking news
Universities educators
-
సీఏఏ : మరో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్ట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. విద్యార్థిలోకం సాహిత్య కారులు, పలువురు మేధావులు ఈ చట్టం ఆటవిక చట్టమని విమర్శిస్తుండగా, మద్దతుగా మరికొంతమంది మేధావులు ముందుకు రావడం విశేషం. దాదాపు 1100 మంది ప్రముఖులు, మేధావులు బహిరంగ లేఖ రాశారు. ప్రముఖ విద్యావేత్తలు, సాహిత్య కారులు సహా, దేశంలోని వివిధ యూనివర్శిటీలకు చెందిన ఉన్నతాధికారులు, పలువురు సీనియర్లు దీనిపై సంతకాలు చేశారు. ఈ విషయంలో ప్రజలు తప్పుడు ప్రచారానికి పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చిన పార్లమెంటును అభినందించారు. మరోవైపు వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో పరిస్థితిని అంచనావేసేందుకు, భద్రతపై చర్చించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మంత్రులతో సమావేశమయ్యారని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా సీఏబీ ప్రతిపాదన మొదలు ఈశాన్య రాష్ట్రమైన అసోం సహా దేశంలోని పలు ప్రాంతాల్లో అందోళనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టం అమానవీయమైందనీ, ముస్లింలపై వివక్ష చూపుతుందని, దేశ లౌకిక రాజ్యాంగాన్ని బలహీనపరుస్తుందని విమర్శకులు భావిస్తున్నారు. ఈ చట్టాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారం పార్లమెంటు చట్టాన్ని ఆమోదించినప్పటి నుండి పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల్లో కనీసం 14 మంది మరణించారు. More than 1,000 academicians from universities across the country release statement in support of Citizenship Amendment Act — Press Trust of India (@PTI_News) December 21, 2019 -
వాడిపోతున్న విద్యావనాలు
నవ తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి ఉత్పత్తి కేంద్రాలుగా విలసిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు బోధకులు లేక వెలవెల బోతున్నాయి.. మౌలిక సదుపాయాలు లేక కునారిల్లిపోతున్నాయి.. రాష్ట్రంలో ఏడు వర్సిటీలు వైస్చాన్స్లర్లు లేకుండానే కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికీ చాలా వర్సిటీల్లో ఉండాల్సిన బోధన సిబ్బందిలో మూడో వంతు కూడా లేరు. దీంతో కోర్సుల నిర్వహణ కష్టతరమవుతోంది. ⇒ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా యూనివర్సిటీల పాలన ⇒ వీసీల నియామకం లేదు.. ప్రొఫెసర్ల భర్తీ లేదు ⇒ 8 మందితో నడుస్తోన్న పాలమూరు వర్సిటీ ⇒ మిగతా వర్సిటీల్లోనూ50 శాతం ఖాళీలే సాక్షి,హైదరాబాద్: గతమెంతో ఘన కీర్తి కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుతో సహా దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులను తీర్చిదిద్దిన ఓయూ క్రమం గా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. 100 ఏళ్ల సంబరానికి దగ్గరవుతున్న ఈ వర్సిటీలో ఏడు నెలల నుంచి వీసీ కూడా లేడు. ఓయూలో 1,230 బోధనా సిబ్బంది పోస్టులు ఉంటే వాటి లో 630 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదవీ విరమణ చేస్తున్నవారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. ఫలితంగా నాలుగేళ్లుగా వర్సిటీ పరిస్థితి దిగజారింది. ఇటీవల దాకా దేశంలో ఐఐటీల తరువాత స్థానాన్ని ఆక్రమించిన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పుడు తన స్థానాన్ని మరింతగా దిగజార్చుకుంటోంది. ఫ్యాకల్టీ లేని కారణంగా ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పెంచేందుకు ఏఐసీటీఈ అంగీకరించడం లేదు. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) డిపార్టుమెంట్ లేదు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉన్న తరుణంలో ముఖ్యమైన ఐటీ కోర్సును ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. సరైన బోధనా సిబ్బంది లేక ఓయూలో కొన్ని కోర్సులు ‘నాక్’ గుర్తింపు కోల్పోయినట్లు తెలిసింది. నాక్ గుర్తింపు కోల్పోయిన కోర్సుల వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్న అధికారులు ప్రస్తుతానికి ఆ సమస్యేమీ లేదని చెబుతున్నారు. ఏడు వర్సిటీల్లోనూ అదే పరిస్థితి తెలంగాణలోని 7 రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలకు 2,232 మంజూరైన పోస్టులు ఉంటే ప్రస్తుతం వాటిల్లో 1,122 మంది మాత్రమే బోధన సిబ్బంది ఉన్నారు. 1,110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త పోస్టులను మంజూరు చేయలేదు. పాలమూరు విశ్వ విద్యాలయం ప్రారంభంలో ఇచ్చిన 28 పోస్టులను కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. శాతవాహన విశ్వవిద్యాలయంలో 44 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరు చేసి 21 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. ఓయూలో 1,230 వరకు మంజూరైన పోస్టులుంటే 600 మంది పనిచేస్తున్నారు. మహాత్మాగాంధీ వర్సిటీలో 14 పోస్టులు ఉంటే నలుగురే పనిచేస్తున్నారు. మిగతా వర్సిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇన్‌చార్జీలే దిక్కు: తెలుగు విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్‌లోని పాలమూరు, కరీంనగర్‌లోని శాతవాహన మినహా మిగతా అన్ని వర్సిటీలు ఇన్చార్జీల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఓయూ, కేయూ, నిజామాబాద్‌లోని తెలంగాణ, నల్లగొండలోని మహాత్మాగాంధీ, హైదరాబాద్‌లోని జేఎన్టీయూ(హెచ్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఐఏఎస్ అధికారులు, వేరే యూనివర్సిటీల వీసీలే ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. పదిమందీ లేకుండా ‘పాలమూరు’ పాలన రాష్ట్రంలో అత్యంత వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం కూడా విద్యా బోధనలో పూర్తిగా వెనక బడింది. ఇక్కడ బోధనా సిబ్బంది ఆరుగురు, బోధనేతర సిబ్బంది ఇద్దరు. మొత్తం 8 మందితో వర్సిటీ పాలన సాగుతోంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.డిగ్రీ కళాశాలలో ఉండే సిబ్బంది సంఖ్యలో పదో వంతు కూడా ఇక్కడ లేకపోవడం గమనార్హం. తెలంగాణలో రెండో అతిపెద్ద కాకతీయ విశ్వ విద్యాలయం పరిస్థితిలోనూ మార్పు లేదు. గడచిన ఏడాది కాలంగా వైస్ చాన్స్‌లర్ లేకుండానే కేయూలో పాలన నడుస్తోంది. నియామకాలు చేపట్టాలి ప్రపంచ బ్యాంకు ఒత్తిడి, ప్రైవేటీకరణలో భాగంగా ఈ పరిస్థితి దాపురించింది. చంద్రబాబు హయాం నుంచే వర్సిటీలు క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోతూ వస్తున్నాయి. వర్సిటీల్లో లైబ్రరీలు లేవు, ల్యాబరేటరీలు లేవు. బ్లాక్ గ్రాంటు లేదు. ఇప్పటికైనా దూరదృష్టి కలిగిన వీసీలు, ఫ్యాకల్టీని నియమించాలి. - ప్రొ.హరగోపాల్, విద్యావేత్త వీసీలు లేకపోతే ఎలా? యూనివర్సిటీల్లో టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్లకు గెడైన్స్ ఇచ్చేది వీసీలే. వాళ్లే లేకుంటే ఇంకా వర్సిటీలు ఎలా మనుగడ సాగిస్తాయి..ప్రొఫెసర్ పరిశోధనను విస్తరించేందుకు మార్గదర్శనం చేస్తారు. కానీ, అలాంటి వారే లేకపోతే బోధించేదెవరు?.ఇప్పటికైనా పోస్టులను భర్తీ చేయాలి. - చుక్కా రామయ్య, విద్యావేత్త