breaking news
Under 15 Age
-
UAE: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వినియోగం, దాని వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేయడం, ఉపయోగించడాన్ని నిషేధిస్తూ.. ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూఏఈ, ఇప్పటికే ఇలాంటి చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాల జాబితాలో చేరింది.యూఏఈ మంత్రివర్గం ఆమోదించిన తీర్మానం ప్రకారం, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను తెరవడం పూర్తిగా నిషేధం. అంతేకాకుండా.. వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని పూర్తి ఫీచర్లను కూడా ఉపయోగించకూడదు. పోస్టులు చేయడం, కామెంట్లు పెట్టడం, కంటెంట్ షేర్ చేయడం, పబ్లిక్ గ్రూపులు లేదా ఓపెన్ ఛానళ్లలో చేరడం వంటి కార్యకలాపాలకు కూడా అనుమతి ఉండదు.ఈ నిబంధనలను అమలు చేయడంలో సోషల్ మీడియా సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించారు. 15 ఏళ్లలోపు పిల్లలు సృష్టించిన ఖాతాలను గుర్తించి, వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం కంపెనీలకు 12 నెలల గడువు ఇచ్చారు. ఒకవేళా నిబంధనలను పాటించకపోతే.. సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లపై హెచ్చరికలు, పరిమితులు లేదా పూర్తిస్థాయి నిషేధం వంటి చర్యలు తీసుకునే అధికారం యూఏఈ ప్రభుత్వ సంస్థలకు ఉంటుంది.సోషల్ మీడియా ద్వారా పిల్లలు అనుచిత కంటెంట్, సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ మోసాలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతను పెంచడం, ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇటీవల సోషల్ మీడియా వినియోగంపై పలు దేశాలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు యూఏఈ కూడా అదే దారిలో అడుగులు వేయడంతో, భవిష్యత్తులో మరిన్ని దేశాలు ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
అబార్షన్లలో 15 ఏళ్లలోపు బాలికలు!
ముంబై: దేశ ఆర్ధిక రాజధానిలో గత మూడేళ్లలో అబార్షన్లు చేయించుకుంటున్న 15 ఏళ్లలోపు బాలికల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2015-16 సంవత్సరానికి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ (ఎమ్ టీపీ)ల నుంచి బీఎమ్ సీలు విడుదల చేసిన జాబితాల్లో ఈ చేదు నిజాలు బయటపడ్డాయి. మొత్తం 34,790 మంది మహిళలు అబార్షన్ చేయించుకోగా వీరిలో 15 ఏళ్లలోపు బాలికలు సంఖ్య 271గా పేర్కొంది గత మూడేళ్ల కంటే ఇది 144 శాతం అత్యధికం. అయితే, 15 నుంచి 19 ఏళ్ల మధ్య గల బాలికల్లో అబార్షన్లు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి. దీనిపై స్పందించిన లింగసమానత్వ యాక్టివిస్ట్ శ్రద్ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్స్ యాక్ట్(పీఓసీఎస్ఓ)ను అమలు చేయాలని కోరారు. ఈ వివరాలను ఆర్టీఐ ద్వారా సేకరించిన చేతన్ కొఠారి మాట్లాడుతూ కాలేజిలకు వెళ్తున్న అమ్మాయిల్లో అవగాహన పెరగడం వల్లే అబార్షన్లు తగ్గాయని చెప్పారు. మొత్తం 32,725 గర్భాలను దాల్చిన 12 వారాల్లోపే తొలగించుకున్నారని వివరించారు. వీరిలో ఎనిమిది మంది మరణించినట్లు తెలిపారు. రిజస్టర్డ్ సెంటర్ల ద్వారా అబార్షన్లు చేయించుకుంటున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. లీగల్ గా రిజిస్టరయిన సెంటర్లలో మాత్రమే అబార్షన్లను చేయించుకోవాలని ముంబై ఫెడరేషన్ ఆఫ్ అబ్ స్టెస్ట్రిక్ అండ్ గైనకోలాజికల్ సొసైటీస్ అధ్యక్షురాలు డా. నందిత పల్ షేక్తర్ అన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థునులకి సెక్స్ కు సంబంధించిన ఎడ్యుకేషన్ అవసరమని శ్రద్ద అభిప్రాయపడ్డారు.


