breaking news
Ujjwal Nikam
-
పెద్దల సభకు ఉజ్వల్ నికమ్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నలుగురు ప్రతిభావంతులను రాజ్యసభకు నామినేట్ చేశారు. 26/11 ముంబయి ఉగ్రవాద దాడి కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసి, పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడేలా కీలక పాత్ర పోషించిన సీనియర్ లాయర్ ఉజ్వల్ నికమ్, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా, కేరళ బీజేపీ నేత సి.సదానందన్ మాస్టర్లు పెద్దల సభకు నామినేట్ అయ్యారు. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 80(1)(ఎ) క్లాజ్ (3) కింద తనకు లభించిన అధికారం మేరకు ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు ఈ నలుగురిని నామినేట్ చేశారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగువ సభకు 12 మందిని పంపించే అధికా రం రాష్ట్రపతికి ఉంది. ప్రధానంగా కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశిష్టమైన సేవలందించిన వ్యక్తులకు రాష్ట్రపతి రాజ్యసభకు పంపిస్తుంటారు. న్యాయ పటిమకు మారుపేరు ఉజ్వల్ ఉజ్వల్ దేవ్‌రావు నికమ్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో కోర్టులో ప్రభుత్వం పక్షాన వాదించారు. దాదాపు 100 మందికి శిక్షలు పడేలా కృషిచేశారు. ఆ తర్వాత 26/11 దాడి కేసులో ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష పడేలా కీలక పాత్ర పోషించారు. ఎన్ని బెదిరింపులు వచి్చనా, ఎన్ని ఒత్తిళ్లున్నా పక్కాగా సాక్ష్యాధా రాలు సేకరించి, కోర్టులో వాదించడం ఉజ్వల్ నికమ్ ప్రత్యేకత. ఇప్పటివరకు వివిధ కేసుల్లో 628 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, 37 మందికి ఉరిశిక్ష పడేలా కోర్టులో వాదించారు. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా ఉజ్వల్ పోటీ చేశారు. దౌత్య నిపుణుడు హర్షవర్ధన్ శ్రింగ్లా హర్షవర్ధన్ శ్రింగ్లా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. 1984 బ్యాచ్‌కు చెందిన ఆయన 38 ఏళ్లకు పైగా దౌత్య సేవలు అందించారు. అమెరికా, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్‌లో భారత రాయ బారిగా, హైకమిషనర్‌గా పని చేశారు. అమెరికా, చైనా వంటి దేశాలతో ఇండియా సంబంధాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020 నుంచి 2022 వరకు భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా సేవలందించారు. 2023లో జీ20 కూటమికి భారత్ నా యకత్వం వహించిన సమయంలో జీ20 స మావేశాల ముఖ్య సమన్వయకర్తగా ఉన్నారు.చరిత్రలో కొత్త వెలుగులు మీనాక్షి జైన్ డాక్టర్ మీనాక్షి జైన్ విద్యావేత్తగా పేరుగాంచారు. చరిత్ర, సామాజిక శా్రస్తాల్లో లోతైన పరిశోధనలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలోని గార్గీ కాలేజీలో హిస్టరీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. భారతీయ నాగరికత, సంస్కృతిపై పలు పుస్తకాలను రచించారు. విద్య, సాహిత్యం, చరిత్ర, రాజనీతిశాస్త్రంలో మీనాక్షి జైన్ సేవలు ప్రశంలందుకున్నాయి. పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. సాహసి సదానందన్ మాస్టర్ కేరళలోని పాలక్కడ్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత సి.సదానందన్ మాస్టర్ రాజకీయ హింసకు భయపడని వ్యక్తిగా ప్రఖ్యాతి చెందారు. పార్టీ మారేందుకు నిరాకరించినందుకు 1994 జనవరి 25న వామపక్ష కార్యకర్తలు ఆయనపై దాడి చేసి, రెండు కాళ్లను నరికేశారు. అయినా సదానంద్ మాస్టర్ ధైర్యం కోల్పోకుండా సమాజ సేవలో నిమగ్నమయ్యారు. విద్యా, సామాజిక రంగాల్లో తన వంతు సేవలందించారు. సుదీర్ఘకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2016, 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున కన్నూర్ నుంచి పోటీ చేశారు. మోదీ మరాఠీలో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ తనతో మరాఠీ భాషలో మాట్లాడారని ఉజ్వల్ నికమ్ ఆదివారం తెలిపారు. తనను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నట్లు ఆయన ముందే చెప్పారని అన్నారు. ‘‘శనివారం ప్రధాని మోదీ నాతో ఫోన్లో మాట్లాడారు. హిందీలో మాట్లాడాలా? లేక మరాఠీలో మాట్లాడాలా? అని అడి గారు. దాంతో ఇద్దరం కాసేపు హాయిగా నవ్వుకున్నాం. చివరకు మోదీ మరాఠీలోనే నాతో సరదాగా సంభాషించారు. రాజ్యసభకు పంపించబోతున్నట్లు చెప్పగా, అందుకు వెంటనే అంగీకారం తెలియజేశా’’ అని ఉజ్వల్నికమ్ వెల్లడించారు. అసాధారణ కృషి చేశారు: మోదీ రాజ్యసభకు నామినేట్ అయిన నలుగురు ప్రముఖులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారి నైపుణ్యం పార్లమెంట్ కార్య కలాపా లను సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ‘‘నలుగురు ప్రముఖులు చేసిన కృషి అసాధారణం. న్యాయరంగం, రాజ్యాంగం పట్ల ఉజ్వల్ నికమ్ నిబద్ధత ప్రశంసనీయమైనది. ఆయనను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం ఒక గౌరవ సూచిక. హర్షవర్దన్ శ్రింగ్లా ప్రతిభావంతుడైన దౌత్యవేత్త. వ్యూహాత్మక ఆలోచనలతో భారత్‌ను అంతర్జాతీయంగా నూతన శిఖరాలకు తీసుకెళ్లారు. సదానందన్ మాస్టర్ జీవితం ధైర్యసాహసాలకు ఒక ప్రతీక. విద్య, సమాజ సేవా రంగాల్లో ఆయన విశేషమైన కృషి సాగించారు. డాక్టర్ మీనాక్షి జైన్ ఒక గొప్ప చరిత్రకారిణి, విద్యావేత్త, పరిశోధనల్లో మేటి. ప్రతిభావంతురాలైన మీనాక్షి జైన్ రాజ్యసభకు వస్తుండడం చాలా సంతోషకరం’’ అని పేర్కొన్నారు. The President of India has nominated Ujjwal Deorao Nikam, a renowned public prosecutor known for handling high-profile criminal cases; C. Sadanandan Maste, a veteran social worker and educationist from Kerala; Harsh Vardhan Shringla, former Foreign Secretary of India; and… pic.twitter.com/eN6ga5CsPw— ANI (@ANI) July 13, 2025రాజ్యసభకు నామినేట్ అయిన కొత్త అభ్యర్థులు వీరే..1. ఉజ్వల్ దేవరావు నికమ్: 26/11 ముంబై ఉగ్ర దాడులతో సహా అనేక ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను విచారించిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్.2. సి. సదానందన్ మాస్తే: దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు సేవలు అందిస్తున్న కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త.3. హర్షవర్ధన్ శ్రింగ్లా: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, కీలక ప్రపంచస్థాయి పదవులలో పనిచేసిన అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త.4. డాక్టర్ మీనాక్షి జైన్: ప్రముఖ విద్యావేత్త, భారతీయ చారిత్రక విజ్ఞానానికి విశేష కృషి చేశారు.న్యాయవాది, బీజేపీ నేత ఉజ్వల్ నికమ్ 1993 ముంబై వరుస పేలుళ్లు, 26/11 ఉగ్రదాడి తదితర కేసులలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఏ) కింద ఈ నామినేషన్లు దాఖలయ్యాయి. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ తదితర రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని రాజ్యసభకు నామినేట్ చేయడానికి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారం ఉంది. -
Lok Sabha Election 2024: నికమ్ వర్సెస్ వర్షా
ముంబై నార్త్ సెంట్రల్. మినీ ముంబైగా పేరొందిన లోక్‌సభ స్థానం. ఆకాశాన్నంటే హార్మ్యాలతోపాటు మురికివాడలు ఇక్కడి ప్రత్యేకత. సెల్రబిటీలతో పాటు వలస కారి్మకులకూ నివాస స్థానం. మే 20న ఐదో విడతలో ఇక్కడ పోలింగ్ జరగనుంది. బీజేపీ నుంచి ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, కాంగ్రెస్ నుంచి పార్టీ ముంబై చీఫ్ వర్షా గైక్వాడ్ బరిలో ఉన్నారు. గత రెండుసార్లూ గెలిచిన బీజేపీ హ్యాట్రిక్ కోసం ప్రయతి్నస్తుండగా, తిరిగి పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ఉవి్వళ్లూరుతోంది...చట్టాలను సవరిస్తా.. ఇక బీజేపీ సిట్టింగ్ ఎంపీ పూనం మహాజన్‌ను పక్కన పెట్టిన మరీ ప్రఖ్యాత లాయర్ ఉజ్వల్ నికమ్‌కు టికెటిచి్చంది. పూనం తండ్రి, బీజేపీ దిగ్గజం ప్రమోద్ మహాజన్ హత్య కేసును వాదించింది ఉజ్వలే కావడం విశేషం! ‘‘ఆ సమయంలో పూనంను దగ్గరగా చూశా. ఇక్కడ రెండుసార్లు గెలిచిన ఆమె ఈసారి నా విజయంలోనూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని నికమ్ చెబుతున్నారు. 1993 ముంబై వరుస పేలుళ్లు, 26/11 ముంబై దాడి వంటి హై ప్రొఫైల్ కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నికమ్ వాదించిన తీరును బీజేపీ ప్రచారంలో హైలైట్ చేస్తోంది. ‘‘రాజకీయాలు నా సెకండ్ ఇన్నింగ్స్. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. అదే నన్ను గెలిపిస్తుంది’’ అని నికమ్ ధీమాతో ఉన్నారు. ‘‘ప్రజల కోసం మేలైన చట్టాలను రూపొందించడానికి కృషి చేయాలనుకుంటున్నా. పారిపోయిన నేరగాళ్లను భారత్‌కు తీసుకువచ్చేలా అప్పగింత చట్టాలను సవరించాలనుకుంటున్నా’’ అని చెబుతున్నారు. వంచిత్ బహుజన్ అగాడీ, మజ్లిస్ అభ్యర్థులు కూడా ముంబై నార్త్ సెంట్రల్లో పోటీలో ఉన్నారు. రాజ్యంగ రక్షణ పోరాటంముంబై నార్త్ సెంట్రల్ కాంగ్రెస్ అభ్యర్థి వర్షా గైక్వాడ్ తండ్రి ఏక్నాథ్ గైక్వాడ్ గతంలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి వర్ష ప్రచారం ప్రారంభించారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన శివసేన సభ్యులు పారీ్టలో చీలిక తర్వాత ఉద్ధవ్ వెంటే ఉండటం కలిసొచ్చే అంశమని వర్షా అంటున్నారు. ‘‘ముంబై నార్త్ సెంట్రల్ తొలినుంచీ కాంగ్రెస్ కంచుకోట. ఈసారి నా విజయాన్ని పార్టీకి కానుకగా అందిస్తా’’ అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.వలస ప్రజల నిలయం... ముంబై ‘మినీ ఇండియా’ అయితే ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ స్థానం ‘మినీ ముంబై’. ఇందులో విలే పార్లే, చండీవలి, బాంద్రా, కలీనా, కుర్లా వంటి ప్రాంతాలున్నాయి. బాంద్రా, ఖర్‌లలో సినీ తారలు, ప్రముఖులు నివసిస్తారు. కుర్లాలో వలస కుటుంబాలు, కారి్మకులు ఎక్కువ. సుమారు 3 లక్షలమంది ఉత్తరాది రాష్ట్రాలవారు, లక్ష మంది దక్షిణాది ప్రజలు, 1.9 లక్షల మంది గుజరాత్, రాజస్థాన్ వాసులు నివసిస్తున్నారు. 3 లక్షలకు పైగా ముస్లింలున్నారు. ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, కాలుష్యం ఇక్కడి ప్రధాన సమస్యలు... – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోప్రాది గ్యాంగ్ రేప్: నిందితులకు ఉరి శిక్ష
సాక్షి, ముంబై : కోప్రాది గ్యాంగ్‌రేప్, హత్య కేసులో ముగ్గురు నిందితులకు అహ్మద్‌నగర్ జిల్లా సెషన్సు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా గత ఏడాది సంచలనం సృష్టించిన కోప్రాది గ్యాంగ్‌రేప్, హత్య కేసులో జితేంద్ర బాబూలాల్ షిండే, సంతోష్ గోర్కా బవాల్, నితిన్ గోపీనాథ్ భలూమే నిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారించేందుకు 2016 డిసెంబర్ 20న స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర్లలోని అహ్మద్ నగర్ జిల్లా కోప్రాదిలో 2016 జులై 13న 15 ఏళ్ల మైనర్ బాలికను ముగ్గురు దుండుగులు గ్యాంగ్‌రేప్ చేసి, ఆపై హత్య చేశారు. రక్తమోడుతున్న బాలిక మృతదేహాన్ని గ్రామానికి దగ్గర్లోని ఒక చెట్టు దగ్గర ప్రజలు గుర్తించారు. బాధిత బాలిక మారాఠా వర్గానికి చెందినది. కేసు తీర్పు వెలువడ్డాక.. నిందితుల తరపు న్యాయవాది బాలాసాహెబ్ ఖోప్డే.. నేరం చేసినా ఇంతటి తీవ్రమైన శిక్ష విధించడం భావ్యం కాదని ఆయన కోర్టుకు తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున కేసు వాదించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్ మాత్రం తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అత్యంత అరుదైన కేసుల్లో ఒకటని.. నిందితులకు ఉరి శిక్షే సరైన శిక్ష అని అన్నారు. -
ముంబైపై ముష్కరుల దాడికి ఐదేళ్లు చెదిరిన జ్ఞాపకాలు
ముంబై: పాకిస్థాన్‌కు చెందిన పదిమంది ఉగ్రవాదులు నగరంపై విరుచుకుపడి అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఘటన చోటుచేసుకుని మరో రెండు రోజుల్లో ఐదేళ్లు కానుంది. ఈ దాడులు దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. అయితే ఆనాటి ఈ పీడకల నగరవాసుల జ్ఞాపకాలనుంచి దాదాపు చెదిరిపోయింది. ఏడాదికొకసారి మృతుల స్మారకార్థం కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం, వాటిని ప్రసా ర మాధ్యమాలు ప్రజలకు చేరవేయడం జరుగుతోందే తప్ప నగరవాసులు మాత్రం తమ తమ దైనందిన కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమైపోయారు. ఆనాటి దాడి ఘట నలో మొత్తం 166 మంది చనిపోగా. మరో 300 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 26 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. అయితే ఈ నెల 26వ తేదీ (దాడి జరిగిన రోజు) సమీపిస్తుండడంతో ఆనాటి పీడకల మరికొందరి మదిలో మిణుకుమిణుకుమంది. ఈ విషయమై విలేపార్లే ప్రాంతంలో నివసించే సాఫ్ట్వేర్ కన ్సల్టెంట్ దుకుల్ పాండ్యా మాట్లాడుతూ ఆనాటి ఘటన అత్యంత విచారకరమన్నారు. అసలు ఆవిధంగా జరిగి ఉండాల్సింది కాదన్నారు. ఏదిఏమైనప్పటికీ నగరవాసులంతా గతం మరిచిపోయి భవిష్యత్తుపై దృష్టి సారించి ముందుకు సాగాలని ఆ రాత్రంతా మెలకువతో ఉండి టీవీలో వస్తున్న దృశ్యాలను తిలకిస్తూ కాలం గడిపిన పాండ్యా పేర్కొన్నాడు. ఇదే విషయమై బోరివలికి చెందిన కె.ఎస్.మీనాక్షి మాట్లాడుతూ అదొక జాతీయ విషాదమన్నారు. దీని సంగతి అలాఉంచితే ద్రవ్యోల్బణం ప్రభావంతో ధరల పెరుగుతుండడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున ్న సమస్యలతోపాటు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు నగరవాసులు అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. 26/11 వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఐదు సంవత్సరాల క్రితం పాకిస్థాన్‌కు చెందిన పది మంది సాయుధ ఉగ్రవాదులు అరేబియా సముద్రమార్గం మీదుగా నగరంలోకి చొరబడ్డారు. అంతకుముందు పాకిస్థాన్ సముద్ర తీరాన్ని దాటివచ్చిన వీరంతా నవంబర్ 26వ తేదీ సాయంత్రం ప్రశాంతంగా దేశరాజధానిలోకి అమాయకుల మాదిరిగా అడుగుపెట్టారు. కొలాబా తీరాన దిగిన వీరంతా ఒక క్రమపద్ధతితో రెండు మూడు బృందాలుగా విడిపోయి తమ తమ లక్ష్యాల దిశగా అడుగులు వేశారు. వీరిలో అబ్దుల్ రెహమాన్, అబూ అలీ, అబూ సోహెబ్‌లు కొలాబాలోని లియోపోల్డ్ కేఫ్ వైపు వెళ్లారు. ఆ తర్వాత తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ దిశగా ముందుకు సాగారు. అబ్దుల్ రెహమాన్ చోటా, ఫహదుల్లాలు ట్రైడెంట్ ఒబెరాయ్ వైపు, నాసిర్ అబూ ఉమర్, బాబర్ ఇమ్రాన్ అలియాస్ అబూ ఆకాశలు నారిమాన్ హౌస్ వైపు, ఇస్మాయిల్ ఖాన్, అబూ ఇస్మాయిల్, అజ్మల్ ఆమిర్ కసబ్‌లు తొలుత నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ టెర్మినస్వైపు, ఆ తర్వాత కామా ఆస్పత్రి దిశగా ముందుకుసాగారు. వీరు ఎంచుకున్న లక్ష్యాలన్నీ అత్యంత ఇరుకైన దక్షిణ ముంబైలో కేవలం ఐదుకిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. అక్కడ బ్యూరోక్రాట్లు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు నివసిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికార నివాసాలు, మంత్రుల నివాసాలు కూడా అక్కడే ఉన్నాయి. ఉగ్రవాదులు నగరంలో విధ్వంసకాండకు దిగినట్టు సమాచారం అందిన తర్వాత రంగంలోకి దిగిన నగర పోలీసులు, సైనిక బలగాలు, నౌకాదళ కమాండోలు, ఇతర పారామిలిటరీ బల గాలు 50 గంటల సుదీర్ఘ పోరాటం జరిపి 22 ఏళ్ల కసబ్ మినహా మిగతా వారందరినీ హతమార్చాయి. ఇక నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున గిర్గావ్ చౌపాటీ వద్ద పోలీసులు అజ్మల్ ఆమిర్ కసబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, హోటల్ తాజ్‌మహల్ ప్యాలెస్, హోటల్ ట్రైడెంట్, నారిమాన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్, కామా ఆస్పత్రి, వాడిబందర్ తదితర ప్రాంతాల్లో సంచరించిన ఈ ఉగ్రవాద బృందం నర మేధానికి పాల్పడింది. అమాయకుల ప్రాణాలను బలిగొంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే విలేపార్లే ప్రాంతంలో తాము ఎక్కిన కారును బాంబులతో పేల్చివేసింది. సజీవంగా దొరికిపోయిన క సబ్‌ను పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారించారు. ఈ విచారణలో దాడులకు ప్రత్యక్ష, పరోక్ష కారకులైన 35 మంది పేర్లను కసబ్ పోలీసులకు వెల్లడించాడు. ఈ కేసుపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికం తన వాదనలను సమర్థంగా వినిపించారు. దీంతో కసబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ దిగువకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును కసబ్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ సవాలుచేశాడు. రెండుచోట్లా చుక్కెదురైంది. తనకు క్షమాబిక్ష పెట్టాలంటూ కసబ్ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. దానిని కూడా రాష్ర్టపతి తిరస్కరించడంతో పుణేలోని ఎరవాడ కేంద్ర కారాగారంలో గత ఏడాది నవంబర్ 21వ తేదీన కసబ్‌ను ఉరితీసిన సంగతి విదితమే. -
కోర్టులో సృహతప్పిన ముంబై గ్యాంగ్ రేప్ బాధితురాలు!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ముంబై గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలు, ఫోటో జర్నలిస్ట్ కోర్టులోనే సృహ కోల్పోయింది. నిందితులను గుర్తించిన బాధితురాలు.. వాగ్మూలం ఇచ్చే సమయంలో కోర్టులో సొమ్మసిల్లి పడిపోయిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. ఫోటో జర్నలిస్ట్ సృహతప్పి పడిపోయిన వెంటనే వాదనలు ఆపివేసి ఆమెను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించామని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పీటీఐకి తెలిపారు. ఆగస్టు 22 తేదిన ముంబైలోని శక్తి మిల్స్ కాంపౌడ్ లో బాధితురాలిపై సామూహిక మానభంగం జరిగినట్టు కేసు నమోదైంది. గురువారం జరిగిన వాదనలకు తన తల్లితో బాధితురాలు కోర్టుకు హాజరయ్యారు. పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ కు కట్టుబడి కోర్టులో సంఘటన వివరించినట్టు తెలిపారు. లైంగికంగా దాడికి ముందు చూపించిన అశ్లీల క్లిప్పింగ్ ను కూడా బాధితురాలు గుర్తించినట్టు నికమ్ తెలిపారు.